టీమిండియా మూడోసారి..

9 Jul, 2018 11:09 IST|Sakshi

బ్రిస్టల్‌: ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని విరాట్‌ గ్యాంగ్‌ 18.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఫలితంగా టీ20 ఫార్మాట్‌లో మూడోసారి అత్యధిక స్కోరును టీమిండియా మూడోసారి ఛేదించింది. అంతకుముందు 2009లో శ్రీలంకపై మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో 207 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్‌ చేసిన టీమిండియా.. ఆపై 2013లో రాజ్‌కోట్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌పై ఛేదించిన తాజా లక్ష్యమే టీమిండియా మూడో అత్యుత్తమంగా నిలిచింది. కాగా, విదేశాల్లో భారత్‌కు ఇదే తొలి అత్యుత్తమ ఛేజింగ్‌ కావడం మరో విశేషం.

ఇదిలా ఉంచితే, అత్యధిక వరుస టీ20 సిరీస్‌లు సాధించిన రెండో జట్టుగా టీమిండియా గుర్తింపు సాధించింది. ఇది భారత్‌కు వరుసగా ఆరో టీ20 సిరీస్‌ కాగా, పాకిస్తాన్‌ వరుసగా 9టీ20 సిరీస్‌లను సాధించి తొలి స్థానంలో ఉంది. ఇక వరుస ఐదు టీ20 సిరీస్‌ల్లో విజయాలతో వెస్టిండీస్‌ మూడో స్థానంలో ఉంది.  మరొకవైపు భారత్‌ ఆడిన ఎనిమిది మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ల్లోనూ విజేతగా నిలిచింది.

సంబంధిత కథనాలు..

టీ20ల్లో రోహిత్‌ అరుదైన ఘనత

మరో రికార్డు నమోదు చేసిన ధోని

మరిన్ని వార్తలు