హిమ దాస్‌కు రెండో స్వర్ణం

9 Jul, 2019 05:49 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత స్టార్‌ అథ్లెట్‌ హిమ దాస్‌ వారం వ్యవధిలో అంతర్జాతీయ టోర్నమెంట్‌లో రెండో స్వర్ణ పతకాన్ని సాధించింది. పోలాండ్‌లో జరిగిన కుట్నో అథ్లెటిక్స్‌ మీట్‌లో హిమ దాస్‌ మహిళల 200 మీటర్ల విభాగంలో పసిడి పతకాన్ని దక్కించుకుంది. హిమ 23.97 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన విస్మయ 24.06 సెకన్లలో రేసును ముగించి రజత పతకం దక్కించుకుంది. గత మంగళవారం పొజ్నాన్‌ అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ప్రి మీట్‌లోనూ హిమ 200 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించింది. 

మరిన్ని వార్తలు