విజేత హిందూ పబ్లిక్‌ స్కూల్‌ 

31 Jul, 2019 10:37 IST|Sakshi

ఇంటర్‌ స్కూల్‌ టీటీ టోర్నమెంట్‌  

సాక్షి, హైదరాబాద్‌: లిటిల్‌ ఫ్లవర్‌ హైస్కూల్‌ (అబిడ్స్‌) ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్‌ స్కూల్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టోర్నమెంట్‌లో జూనియర్‌ బాలికల టీమ్‌ విభాగంలో హిందూ పబ్లిక్‌ స్కూల్‌ విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో హిందూ పబ్లిక్‌ స్కూల్‌ 3–0తో చిరెక్‌ (సీబీఎస్‌ఈ–ఎ) పబ్లిక్‌ స్కూల్‌ జట్టుపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్స్‌లో హిందూ పబ్లిక్‌ స్కూల్‌ 3–2తో డాన్‌ బాస్కో జట్టుపై, చిరెక్‌ 3–2తో ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌పై గెలుపొందాయి. జూనియర్‌ బాలుర విభాగంలో చిరెక్‌ (సీబీఎస్‌ఈ–ఎ) పబ్లిక్‌ స్కూల్, సెయింట్‌ పాల్స్‌ హైస్కూల్‌ ‘బి’, సెయింట్‌ పాల్స్‌ హైస్కూల్‌ ‘ఎ’, చిరెక్‌ కేంబ్రిడ్జ్‌ స్కూల్‌ జట్లు సెమీఫైనల్లోకి అడుగుపెట్టాయి.

మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో చిరెక్‌ 2–0తో డీపీఎస్‌ (ఖాజా గూడ) జట్టుపై, చిరెక్‌ కేంబ్రిడ్జి స్కూల్‌ 2–0తో భారతీయ విద్యాభవన్‌ (జూబ్లీహిల్స్‌)పై... సెయింట్‌ పాల్స్‌ ‘ఎ’ 2–0తో చిరెక్‌ సీబీఎస్‌ఈ–ఎఫ్‌ జట్టుపై, సెయింట్‌ పాల్స్‌ ‘బి’ 2–0తో డీఏవీ జట్టుపై గెలిచాయి. సీనియర్‌ బాలికల విభాగంలో రోజరీ కాన్వెంట్‌ (అబిడ్స్‌), డాన్‌ బాస్కో హైస్కూల్, గీతాంజలి దేవాశ్రయ్, సెయింట్‌ పాల్స్‌ హైస్కూల్‌ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. కామన్వెల్త్‌ టీటీ చాంపియన్‌షిప్‌లో మూడు పతకాలు సాధించిన తెలంగాణ అంతర్జాతీయ క్రీడాకారిణి ఆకుల శ్రీజ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ టోర్నమెంట్‌ను ప్రారంభించింది.  
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రిక్వార్టర్స్‌లో ప్రజ్నేశ్‌ 

మెయిన్‌ ‘డ్రా’కు సాయి ఉత్తేజిత 

సైనిక విధుల్లో చేరిన ధోని

కరువు సీమలో మరో టెండూల్కర్‌

అంతా నా తలరాత.. : పృథ్వీషా

క్రికెట్‌కు వేణు గుడ్‌బై 

భారత హెడ్‌ కోచ్‌ పదవి రేసులో జయవర్ధనే! 

డోప్‌ టెస్టులో పృథ్వీ షా  విఫలం 

భారత యువతిని పెళ్లాడనున్న పాక్‌ క్రికెటర్‌ 

అదంతా ఒట్టి భ్రమే! 

వచ్చేసింది.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 

యువీ సరదా ప్రశ్న.. ‘మీ ఇద్దరి పెళ్లెప్పుడు’

‘టీమిండియా కోచ్‌కు అవే ప్రధానం’

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

ప్రొఫెషనల్‌ క్రికెటర్లూ.. ఈ క్యాచ్‌ను నోట్‌ చేసుకోండి!

కోహ్లి.. నీకిది తగదు!

గావస్కర్‌కు మంజ్రేకర్‌ కౌంటర్‌!

యువరాజ్‌ దూకుడు

ఎఫైర్ల వివాదంలో పాక్‌ క్రికెటర్‌ క్షమాపణలు

గేల్‌ మెరుపులు.. ఆకాశంలో ఉరుములు!

‘టీమిండియాకు గట్టిపోటీ తప్పదు’

దీపా కర్మాకర్‌ ఇంకా కోలుకోలేదు

సహజశ్రీకి డబ్ల్యూఐఎం హోదా

కావ్య, నందినిలకు స్వర్ణాలు

అంతా నాన్సెన్స్‌ : రవిశాస్త్రి

వైదొలిగిన సింధు

16 ఏళ్ల రికార్డు బద్దలు

గట్టెక్కిన పట్నా పైరేట్స్‌

రోహిత్‌తో విభేదాలు.. అబద్ధపు ప్రచారమని కోహ్లి ఆవేదన

బెంగాల్‌ చేతిలో పుణెరి చిత్తుచిత్తుగా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు

ఓ బేబీ ఎంత పనిచేశావ్‌

800లో భాగస్వామ్యం

తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి