హాకీ ఇండియాకు ఊరట

20 Sep, 2015 01:47 IST|Sakshi

న్యూఢిల్లీ : హాకీ ఇండియా (హెచ్‌ఐ)కు క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏఎస్) నుంచి ఊరట లభించింది. దేశంలో హాకీ వ్యవస్థ తమ చేతుల్లో ఉండాలని గతంలో భారత హాకీ సమాఖ్య (ఐహెచ్‌ఎఫ్) వేసిన కేసును సీఏఎస్ తోసిపుచ్చింది. దీంతో హెచ్‌ఐకి న్యాయపరమైన చిక్కులు తొలగినట్టయ్యింది. 2008లో భారత ఒలింపిక్ సంఘం, అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ఐహెచ్‌ఎఫ్ గుర్తింపును రద్దు చేసింది.

దీంతో గత నవంబర్‌లో ఐహెచ్‌ఎఫ్ ఈ అప్పీల్ చేసుకుని భారత్ నుంచి తమకు గుర్తింపునివ్వాలని కోరింది. అయితే ఐహెచ్‌ఎఫ్‌కు సంబంధించిన అన్ని అప్పీళ్లను సీఏఎస్ డిస్మిస్ చేసింది.

>
మరిన్ని వార్తలు