భారత్‌ అజేయంగా

12 Apr, 2019 04:42 IST|Sakshi

4–0తో సిరీస్‌ కైవసం 

మలేసియాతో ద్వైపాక్షిక హాకీ టోర్నీ

కౌలాలంపూర్‌: మలేసియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత మహిళల జట్టు అజేయంగా నిలిచింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్‌లోనూ భారత్‌ 1–0తో మలేసియాపై గెలుపొందింది. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను ఆట 35వ నిమిషంలో నవ్‌జ్యోత్‌ కౌర్‌ సాధించింది. ఈ సిరీస్‌లో భారత్‌ వరుసగా తొలి నాలుగు మ్యాచ్‌ల్లో 3–0, 5–0, 4–4, 1–0 గోల్స్‌తో ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఐదో మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించి 4–0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆరంభంలో ఇరు జట్లు పోటాపోటీగా తలపడటంతో రెండు క్వార్టర్ల పాటు ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు.

అయితే మూడో క్వార్టర్‌లో నవ్‌జ్యోత్‌ కౌర్‌ అద్భుత ఫీల్డ్‌ గోల్‌తో భారత్‌ ఖాతా తెరిచింది. ఆధిక్యాన్ని దక్కించుకున్న భారత మహిళలు ప్రత్యర్థికి గోల్‌ చేసే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించారు. ఈ విజయంపై కోచ్‌ జోయెర్డ్‌ మరీనే మాట్లాడుతూ ‘ భారత్‌ గోల్‌ చేసే అవకాశాలు సృష్టించుకున్న తీరు అభినందనీయం. ప్రత్యర్థి గోల్‌ ఏరియాలోకి చాలా సార్లు దూసుకెళ్లి వారిపై ఒత్తిడి పెంచాం. కానీ పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచలేకపోతున్నాం. దీనిపై దృష్టి సారించాలి’ అని పేర్కొన్నాడు. ఓవరాల్‌గా ఈ టూర్‌ యువ క్రీడాకారిణులకు మంచి అనుభవాన్ని ఇచ్చింది’ అన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యువీ చాలెంజ్‌.. బ్యాట్‌ పట్టిన ధావన్‌

కోహ్లి ఎంట్రీ.. సమావేశం వాయిదా!

ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు

ధోని భవితవ్యం తేలేది రేపే!

ఇంగ్లండ్‌ కోచ్‌కు సన్‌రైజర్స్‌ బంపర్‌ ఆఫర్‌

ఐసీసీకి కివీస్‌ కోచ్‌ విన్నపం

‘ఛీ.. రజాక్‌ ఇలాంటోడా?’

సూపర్‌ ఓవర్‌ టెన్షన్‌.. ప్రాణాలు వదిలిన కోచ్‌

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

స్టోక్స్‌ ఆ పరుగులు వద్దన్నాడట!

కపిల్‌ త్రయం చేతిలో... హెడ్‌ కోచ్‌ ఎంపిక బాధ్యత!

అబొజర్‌కు తెలుగు టైటాన్స్‌ పగ్గాలు

సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ: ఇషా సింగ్‌కు రజతం

సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

ప్రపంచకప్‌ ఎఫెక్ట్‌: రాయ్‌ తొలిసారి

యుముంబా కెప్టెన్‌ ఫజల్‌ అట్రాచలీ

పాండే సెంచరీ.. కృనాల్‌ పాంచ్‌ పటాక

‘ఇక ఆడింది చాలు.. వెళ్లిపోండి’

కూతేస్తే.. కేకలే

‘విశ్రాంతి వద్దు.. నేను వెళతాను!’

ఐసీసీ కీలక నిర్ణయం యాషెస్‌ నుంచే అమలు!

కోచ్‌ల కోసం తొందరెందుకు?

స్టోక్స్‌ వద్దన్నా.. అంపైర్లు వింటేగా

పంత్‌ కోసం ధోనీ చేయబోతుందిదే!

‘బౌండరీ’కి బదులు రెండో సూపర్‌

విలియమ్సన్‌పై రవిశాస్త్రి ప్రశంసలు

ఆ ‘స్పెషల్‌’ జాబితాలో రోహిత్‌శర్మ

ఓ 50 ఏళ్లు దాటాక వీళ్లు ఎలా ఉంటారంటే..!

గాయం బెడద భయం గొల్పుతోంది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం