ఫీల్డ్‌లోనే హాకీ స్టిక్స్‌తో కొట్టుకున్న ఆటగాళ్లు

26 Nov, 2019 12:21 IST|Sakshi

ఢిల్లీ: అదొక హాకీ మ్యాచ్‌.. జాతీయ స్థాయిలో జరిగే నెహ్రా హాకీ కప్‌ టోర్నమెంట్‌. అందులోనూ ఫైనల్‌ మ్యాచ్‌.  ఇక్కడ ఆటగాళ్లు క్రీడా స్పూర్తిని మరిచిపోవడమే కాదు.. విజ్ఞతను కూడా వదిలేశారు. హాకీ స్టిక్స్‌తో ఒకరిపై ఒకరు తెగబడ్డారు. మ్యాచ్‌ను గెలిచి తీరాలన్న కసి కాస్తా కొట్లాటకు దారి తీసింది. ఈ కొట్లాటలో పంజాబ్‌ పోలీస్‌ జట్టు.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ జట్లు భాగమయ్యాయి.  

వివరాల్లోకి వెళితే..  56వ నెహ్రూ హాకీ టోర్నమెంట్‌లో భాగంగా పంజాబ్‌ పోలీస్ టీమ్‌- పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ టీమ్‌లు సోమవారం తుది పోరులో తలపడ్డాయి. ఈ రెండు జట్ల మధ్య ఆసక్తికరంగా మ్యాచ్‌ సాగుతోంది. ఆటలో నువ్వా-నేనా అన్నట్లు ఇరు జట్లు తలపడుతున్నాయి. తలో మూడు గోల్స్‌తో సమంగా ఉన్నాయి. ఆ సమయంలో పంజాబ్‌ పోలీస్‌ జట్టు.. పీఎన్‌బీతో కాస్త దురుసుగా ప‍్రవర్తించింది. దాంతో ఇరు జట్ల ఆటగాళ్లు తొలుత మాటల యుద్ధానికి దిగారు. అది కాస్తా పెద్దదిగా మారి కొట్టుకునే వరకూ వెళ్లింది. హాకీ స్టిక్స్‌తో ఇరు జట్లు ఆటగాళ్లు కొట్టుకున్నారు. దాంతో మ్యాచ్‌ నిర్వహాకులు కలగజేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. దీనిపై నేషనల్‌ ఫుట్‌బాల్‌ హాకీ ఫెడరేషన్‌ సీరియస్‌ అయ్యింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టోర్నమెంట్‌లో నిర్వహకుల్ని కోరింది. ఈ గొడవ తర్వాత మళ్లీ మ్యాచ్‌ను కొనసాగించగా పీఎన్‌బీ 6-3 తేడాతో పంజాబ్‌ పోలీస్‌ జట్టుపై గెలిచింది.

మరిన్ని వార్తలు