భారత్‌ ఆశలు సజీవం

30 Jul, 2018 01:30 IST|Sakshi

రెండేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ టైటిల్‌ 

లండన్‌: ప్రపంచకప్‌ మహిళల హాకీ టోర్నీలో భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్‌ చేరే అవకాశాలు సజీవంగా నిలిచాయి. పూల్‌ ‘బి’లో భాగంగా అమెరికా జట్టుతో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌ను భారత్‌ 1–1తో ‘డ్రా’ చేసుకుంది. అమెరికా తరఫున మార్‌గాక్స్‌ (11వ ని.లో), భారత్‌ తరఫున కెప్టెన్‌ రాణి రాంపాల్‌ (31వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. ప్రస్తుతం పూల్‌ ‘బి’లో రెండు పాయింట్లతో భారత్, అమెరికా సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి.

అయితే మెరుగైన గోల్స్‌ సగటులో భారత్‌ (–1) ముందంజలో ఉండగా... అమెరికా (–2) నాలుగో స్థానంలో ఉంది. పూల్‌ ‘బి’లో ఇంగ్లండ్, ఐర్లాండ్‌ జట్ల మధ్య చివరి లీగ్‌ మ్యాచ్‌ ముగిశాకే మంగళవారం జరిగే క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌లో భారత ప్రత్యర్థి (ఇటలీ లేదా కొరియా) ఎవరో తేలుతుంది.   
 

>
మరిన్ని వార్తలు