భారత్‌కు తొమ్మిదో స్థానం

15 Jun, 2014 01:37 IST|Sakshi

ది హేగ్ (నెదర్లాండ్స్): టోర్నీ ఆరంభంలో అంచనాలకు అనుగుణంగా రాణించడంలో విఫలమైన భారత పురుషుల హాకీ జట్టు... ప్రపంచకప్‌లో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. 9-10వ స్థానాల కోసం శనివారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో టీమిండియా 3-0 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది.
 
 ఈ విజయంతో గతేడాది ఆసియా కప్ ఫైనల్లో కొరియా చేతిలో ఎదురైన ఓటమికి సర్దార్ సింగ్ బృందం బదులు తీర్చుకుంది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ రెండు గోల్స్ (6, 50వ నిమిషాల్లో) చేయగా... రూపిందర్ పాల్ సింగ్ (43వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. స్వదేశంలో జరిగిన 2010 ప్రపంచకప్‌లో భారత్ ఎనిమిదో స్థానంలో నిలువగా... ఈసారి ఒకస్థానం పడిపోయి తొమ్మిదో స్థానంతో సంతృప్తి పడింది.
 
 నెదర్లాండ్స్‌కు టైటిల్
 మహిళల విభాగంలో నెదర్లాండ్స్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో నెదర్లాండ్స్ 2-0తో ఆస్ట్రేలియాను ఓడించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2-1తో అమెరికాపై గెలిచింది.
 

మరిన్ని వార్తలు