హోమాన్షిక రెడ్డికి మూడు స్వర్ణాలు

11 Aug, 2019 10:11 IST|Sakshi

తెలంగాణ రాష్ట్ర షూటింగ్‌ చాంపియన్‌షిప్‌

రాయదుర్గం: తెలంగాణ రాష్ట్ర షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో హైదరాబాద్‌ యువ షూటర్‌ హోమాన్షిక రెడ్డి అదరగొట్టింది. గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని ‘శాట్స్‌’ షూటింగ్‌ రేంజ్‌లో శనివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో హోమాన్షిక మూడు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. బేగంపేట్‌ హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పదో తరగతి విద్యా   ర్థిని అయిన హోమాన్షిక ఎయిర్‌ రైఫిల్‌ 10 మీటర్ల పెప్‌ సైట్‌ ఈవెంట్‌లోని సీనియర్, జూనియర్, యూత్‌ విభాగాల్లో విజేతగా నిలిచింది.

హోమాన్షికను తండ్రి మహీపాల్‌ రెడ్డి, కోచ్‌లు అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించి జాతీయ జట్టులో స్థానం సాధించాలని ఆకాంక్షించారు. మియాపూర్‌లోని జెనిసిస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో పదో తరగతి చదివే సంతోషి అభిజ్ఞ మూడో స్థానంలో నిలిచింది. రెండు విభాగాలలో ఆమె కాంస్య పతకాలను సాధించింది. పోటీల చివరి రోజు రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ (శాట్స్‌) చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ దినకర్‌ బాబు, ఐఆర్‌ఎస్‌ అధికారి డాక్టర్‌ మంజుల, తెలంగాణ రాష్ట్ర షూటింగ్‌ విభాగం ప్రతినిధులు పాల్గొని విజేతలకు బహుమతులను అందించారు.  
ఇతర విభాగాల విజేతల వివరాలు

10మీ. రైఫిల్‌ యూత్‌ మహిళలు: 1. హోమాన్షిక రెడ్డి, 2. తన్వీ, 3. సంతోషి అభిజ్ఞ. 10మీ. రైఫిల్‌ జూనియర్‌ మహిళలు: 1. హోమాన్షిక రెడ్డి, 2. తన్వీ, 3. సంతోషి అభిజ్ఞ.

10మీ. రైఫిల్‌ మహిళలు: 1. హోమాన్షిక, 2. తన్వీ, 3. సుప్రియ. 10మీ. రైఫిల్‌ యూత్‌ పురుషులు: 1. ధనుశ్‌ శ్రీకాంత్, 2. బిజ్జు, 3. రమణ. 10మీ. రైఫిల్‌ జూనియర్‌ పురుషులు: 1. ధనుశ్‌ శ్రీకాంత్, 2. పరాష్కర్, 3. బిజ్జు. 10మీ. రైఫిల్‌ పురుషులు: 1. ధనుశ్‌ శ్రీకాంత్, 2. పరాష్కర్, 3. ఆదిత్య. 10మీ. రైఫిల్‌ యూత్‌ మహిళలు: 1. సామియా, 2. నాజ్‌ అంజుమ్, 3. షిరీన్‌ . 10మీ. రైపిల్‌ జూనియర్‌ మహిళలు: 1. నాజ్‌ అంజుమ్, 2. షిరీన్‌. 10మీ. రైఫిల్‌ మహిళలు: 1. సుమయ్యా ఫాతిమా, 2. ప్రవాణి, 3. నైలా. 10మీ. రైఫిల్‌ యూత్‌ పురుషులు: 1. సల్మాన్, 2. రవితేజ, 3. శివకృష్ణ. 10మీ. రైఫిల్‌ జూనియర్‌ పురుషులు: 1. ధనుశ్‌ రెడ్డి, 2. హాజీ అబ్దుల్‌ రషీద్, 3. తనీశ్‌. 10మీ. రైఫిల్‌ పురుషులు: 1. ధనుశ్‌ రెడ్డి, 2. మీర్జా అర్బాజ్‌ బేగ్, 3. ఆసిఫ్‌ ఉమర్‌. 10మీ. పిస్టల్‌ యూత్‌ మహిళలు: 1. అర్కితా 2. ఆషిత, 3. రినీషా. 10మీ. పిస్టల్‌ జూనియర్‌ మహిళలు: 1. ఫాతిమా, 2. జాబిలి, 3. అర్కితా. 10మీ. పిస్టల్‌ మహిళలు: 1. ఫాతిమా, 2. జాబిలి, 3. మాళవిక. 10మీ. పిస్టల్‌ యూత్‌ పురుషులు: 1. కౌశిక్, 2. సాత్విక్, 3. తరుణ్‌. 10మీ. పిస్టల్‌ జూనియర్‌ పురుషులు: 1. కౌశిక్, 2. జైనులాబ్దిన్, 3. సాత్విక్‌.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా