టీమిండియాతో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన హాంకాంగ్‌

18 Sep, 2018 16:48 IST|Sakshi

దుబాయ్‌:ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో హాంకాంగ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన హాంకాంగ్‌ కెప్టెన్‌ అన్షుమాన్‌ రాత్‌ ముందుగా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించి టోర్నీలో ఘనమైన ఆరంభాన్నివ్వాలని భారత్‌ భావిస్తోంది. భారత్, హాంకాంగ్‌ పదేళ్ల క్రితం ఇదే ఆసియా టోర్నీలో ఒకే ఒకసారి తలపడ్డాయి. నాటి మ్యాచ్‌లో భారత్‌ ఏకంగా 256 పరుగులతో ఘన విజయం సాధించింది.

ఇప్పుడు మరోసారి ఈ రెండు జట్లు ముఖాముఖికి సిద్ధమయ్యాయి. బలా బలాలను చూస్తే ప్రత్యర్థికంటే అందనంత ఎత్తులో ఉన్న భారత్‌కు విజయంలో ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకపోవచ్చు. సరిగ్గా చెప్పాలంటే బుధవారం పాకిస్తాన్‌తో తలపడాల్సి ఉన్న రోహిత్‌ సేనకు... హాంకాంగ్‌తో మ్యాచ్‌ వార్మప్‌గానే ఉపకరిస్తుంది. ఈ మ్యాచ్‌ ద్వారా లెఫ్టార్మ్‌ మీడియం పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతనికి భారత తుది జట్టులో చోటు దక్కింది.

మరిన్ని వార్తలు