తొలిరోజు ఆతిథ్య జట్లదే.. ఎన్నో సారూప్యతలు

14 Feb, 2015 17:34 IST|Sakshi

మెల్బోర్న్: ప్రపంచ కప్లో తొలిరోజు ఆతిథ్య జట్లదే హవా. సొంతగడ్డపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అదరగొట్టాయి. శనివారం జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ ఎన్నో సారూప్యతలున్నాయి. రెండూ ఏకపక్షంగా సాగాయి. రెండింటిలోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. భారీ లక్ష్యాలను నిర్దేశించాయి. ఆతిథ్య జట్లే భారీ తేడాతో విజయం సాధించాయి.

ప్రపంచ కప్ తొలి మ్యాచ్ శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఈ రోజు ఉదయం క్రైస్ట్చర్చి (న్యూజిలాండ్) జరిగిన ఈ మ్యాచ్లో కివీస్ 98 పరుగులతో లంకేయులపై ఘనవిజయం సాధించింది. కివీస్ మొదట నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 331 పరుగులు చేయగా.. లంక 46.1 ఓవర్లలో 233 పరుగులకు కుప్పకూలింది.

అనంతరం మెల్బోర్న్ (ఆస్ట్రేలియా)లో జరిగిన రెండో మ్యాచ్లో కంగారూలు 111 పరుగులతో ఇంగ్లీష్ మెన్ను చిత్తుచేశారు. తొలుత ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 231 పరుగులు సాధించగా, లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 41.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్ (135) సెంచరీతో సత్తాచాటాడు.

>
మరిన్ని వార్తలు