వైరల్‌: శాంసన్‌ను డిస్ట్రబ్‌ చేసిన పిజ్జా బాయ్‌!

31 Mar, 2019 09:30 IST|Sakshi

హైదరాబాద్‌ : ఐపీఎల్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు సంజూ శాంసన్‌ను పిజ్జా డెలివరీ బాయ్‌ డిస్ట్రబ్‌ చేశాడు. శుక్రవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శాంసన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సన్‌రైజర్స్‌ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్ ‌12వ ఓవర్‌ చివరి బంతి వేస్తుండగా.. పిజ్జా డెలివరీ బాయ్‌ సైట్‌ స్క్రీన్‌ అడ్డుగా వచ్చాడు. ఇబ్బందిగా ఫీలైన శాంసన్‌.. శంకర్‌ను బంతి వేయకుండా అడ్డుకున్నాడు. దీంతో ఒక్కసారి ఏం జరిగిందోనని మైదానంలో అభిమానులు అవాక్కయ్యారు. తీరా పిజ్జా డెలివరీ బాయ్‌ వల్ల శాంసన్‌ శంకర్‌ను ఆపాడని తెలిసి నిట్టూర్చారు. పిజ్జా బాయ్‌ ఎంత పని చేశాడంటూ కామెంటేటర్స్‌ నవ్వుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. పిజ్జా బాయ్‌ ఆటంకం కలిగించినా శాంసన్‌ ఏ మాత్రం డిస్ట్రబ్‌ కాలేదు. 55 బంతుల్లో 102 నాటౌట్‌; 10 ఫోర్లు, 2 సిక్సర్లు అద్భుత సెంచరీ సాధించాడు. శాంసన్‌ సెంచరీ చేసిన రాజస్తాన్‌ విజయం సాధించలేకపోయింది. సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు వార్నర్‌ (37 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్‌స్టో (28 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్‌), విజయ్‌ శంకర్‌ (15 బంతుల్లో 35; 1 ఫోర్, 3 సిక్సర్లు)లు చెలరేగడంతో సన్‌రైజర్స్‌ తొలి విజయం నమోదు చేసింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు