ఓవరాల్‌ చాంపియన్‌ హెచ్‌పీఎస్‌

24 Sep, 2017 10:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీబీఎస్‌ఈ క్లస్టర్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో భాగంగా అథ్లెటిక్స్‌ విభాగంలో హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (హెచ్‌పీఎస్‌–రామంతాపూర్‌) జట్టు సత్తా చాటింది. గచ్చిబౌలిలో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 149 పాయింట్లు సాధించి ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను దక్కించుకుంది. మరోవైపు అండర్‌–14 బాలబాలికల టీమ్‌ చాంపియన్‌షిప్‌ టైటిళ్లను సెయింట్‌ ఆండ్రూస్‌ జట్టు కైవసం చేసుకుంది. అండర్‌–17 బాలు ర టీమ్‌ విభాగంలో హెచ్‌పీఎస్‌ రామంతాపూర్, బాలికల కేటగిరీలో సెయింట్‌ ఆండ్రూస్‌ జట్లు... అండర్‌–19 కేటగిరీలో హెచ్‌పీఎస్‌ (బాలుర), ఏపీఎస్‌ ఆర్‌కే పురం (బాలికల) జట్లు టీమ్‌ చాంపియన్‌షిప్‌ టైటిళ్లను గెలుచుకున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీ శనివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో డీపీఎస్‌ చైర్మన్‌ కొమురయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు ప్రదానం చేశారు.  

డీపీఎస్‌ జోరు

సీబీఎస్‌ఈ క్లస్టర్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (డీపీఎస్‌) జట్లు జోరు కనబరుస్తున్నాయి. శనివారం జరిగిన అండర్‌–17 మ్యాచ్‌ల్లో డీపీఎస్‌ (వరంగల్‌) 3–1తో జూబ్లీహిల్స్‌ హైస్కూల్‌పై, డీపీఎస్‌ (విజయవాడ) 4–0తో స్పార్కిల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌పై, డీపీఎస్‌ (ఖాజాగూడ) 1–0తో భవన్స్‌ రామకృష్ణ జట్లపై గెలుపొందాయి. ఇతర మ్యాచ్‌ల్లో పరమహంస స్కూల్‌ 1–0తో సెయింట్‌ పీటర్స్‌పై, ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌ 1–0తో దేవ్‌ పబ్లిక్‌ స్కూల్‌పై, ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (గోల్కొండ) 5–0తో ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌పై విజయం సాధించాయి.  

టైటిల్‌ పోరుకు డీపీఎస్, ఓక్రిడ్జ్‌ జట్లు

బాస్కెట్‌బాల్‌ ఈవెంట్‌లో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (డీపీఎస్‌) నాచారం, ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ జట్లు టైటిల్‌ పోరుకు అర్హత సాధించాయి. శనివారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లో డీపీఎస్‌ నాచారం 49–36తో గ్లెండేల్‌ అకాడమీ (తెలంగాణ)పై గెలుపొందగా, మరో సెమీస్‌ మ్యాచ్‌లో ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ 32–15తో ఓబుల్‌ రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో డీపీఎస్‌ 66–37తో సెయింట్‌ ఆండ్రూస్‌ను, గ్లెండేల్‌ అకాడమీ 64–43తో ఇండస్‌ యూనివర్సల్‌ జట్టును ఓడించాయి.

మరిన్ని వార్తలు