హైదరాబాద్‌ 474/9 డిక్లేర్డ్‌

3 Nov, 2017 00:14 IST|Sakshi

న్యూఢిల్లీ: కెప్టెన్‌ అంబటి రాయుడు (112; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), సందీప్‌ (82; 10 ఫోర్లు), టి.రవితేజ (70; 9 ఫోర్లు, ఒక సిక్స్‌) ఆకట్టుకోవడంతో... రంజీ ట్రోఫీలో భాగంగా రైల్వేస్‌ జట్టుతో జరుగుతోన్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 474 పరుగులవద్ద డిక్లేర్‌ చేసింది.  అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రైల్వేస్‌ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 35 పరుగులు చేసింది.   

పుజారా ‘డబుల్‌’ రికార్డు...
రాజ్‌కోట్‌లో జార్ఖండ్‌ జట్టుతో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా (204; 28 ఫోర్లు) డబుల్‌ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధికంగా 12 డబుల్‌ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా పుజారా రికార్డు నెలకొల్పాడు. విజయ్‌ మర్చంట్‌ (11) పేరిట ఉన్న రికార్డును పుజారా తిరగరాశాడు. పుజారా ద్విశతకంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 553 పరుగులవద్ద డిక్లేర్‌ చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి జార్ఖండ్‌ 2 వికెట్లకు 52 పరుగులు చేసింది.   

మరిన్ని వార్తలు