విజేతలు హైదరాబాద్, రంగారెడ్డి

17 Dec, 2019 10:07 IST|Sakshi

టగ్‌ ఆఫ్‌ వార్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: అంతర్‌ జిల్లా సీనియర్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా జట్లు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. మహబూబాబాద్‌ వేదికగా జరిగిన ఈ టోరీ్నలో హైదరాబాద్‌ మహిళల జట్టు, రంగారెడ్డి పురుషుల జట్టు చాంపియన్‌లుగా నిలిచాయి. సోమవారం జరిగిన మహిళల ఫైనల్లో హైదరాబాద్‌ 3–0తో మహబూబాబాద్‌పై నెగ్గింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో కరీంనగర్‌ 3–0తో వరంగల్‌ రూరల్‌ను ఓడించింది.

పురుషుల టైటిల్‌ పోరులో రంగారెడ్డి 3–0తో హైదరాబాద్‌పై గెలుపొందింది. కామారెడ్డి 3–0తో సిద్దిపేట్‌ను ఓడించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టగ్‌ ఆఫ్‌ వార్‌ సంఘం (టీఎస్‌టీడబ్ల్యూఏ) కార్యదర్శి పి. ఎమ్మాన్యుయేల్, తొర్రూర్‌ జెడ్పీటీసీ శ్రీనివాస్‌ ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను బహూకరించారు.   

మరిన్ని వార్తలు