ఆస్ట్రేలియా ఓపెన్‌లో బాల్‌ కిడ్స్‌గా హైదరాబాదీలు

9 Jan, 2020 10:46 IST|Sakshi

సంస్కతి,  ఆదిత్యలకు అరుదైన అవకాశం  

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో భాగమయ్యే అరుదైన అవకాశాన్ని హైదరాబాద్‌కు చెందిన వర్ధమాన క్రీడాకారులు ఆదిత్య, సంస్కతి వాడకట్టు అందుకున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ వేదికగా ఈనెల 20 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే ఈ టోర్నీలో వీరిద్దరూ ‘బాల్‌ కిడ్స్‌’గా వ్యవహరించనున్నారు. కియా మోటార్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బాల్‌ కిడ్స్‌ ఇండియా ప్రోగ్రామ్‌’ ద్వారా భారత్‌లోని పది మంది క్రీడాకారులు ఈ అవకాశాన్ని సొంతం చేసుకున్నారు.

మొత్తం 10 నగరాల్లో నిర్వహించిన సెలక్షన్స్‌లో 250 మంది ఈ అవకాశం కోసం పోటీపడగా మెరుగైన ప్రతిభ కనబరిచిన పది మందిని ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నిర్వాహకులు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన 14 ఏళ్ల ఆదిత్య బీఎంవీ, 15 ఏళ్ల సంస్కతి చోటు దక్కించుకున్నారు.  

బాల్‌ కిడ్స్‌గా ఎంపికైనవారి జాబితా: ఆదిత్య, సంస్కతి (హైదరాబాద్‌), అథర్వ హితేంద్ర (అహ్మదాబాద్‌), అత్రిజో సేన్‌గుప్తా (కోల్‌కతా), దివ్యాన్షు పాండే, హర్షిత్‌ పండిత (గురుగ్రామ్‌), రిజుల్‌ భాటియా (పంచకుల), సర్గమ్‌ సింగ్లా (చండీగఢ్‌), శారి్వన్‌ కౌస్తుభ్‌ (ముంబై,’ యశ్‌వర్ధన్‌ గౌర్‌ (చండీగఢ్‌).  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా