మెహదీ మాయాజాలం

29 Sep, 2018 10:07 IST|Sakshi

 5 వికెట్లతో చెలరేగిన స్పిన్నర్‌

 తన్మయ్, అక్షత్‌ అర్ధ సెంచరీలు

 9 వికెట్లతో యూపీపై హైదరాబాద్‌ ఘనవిజయం

 విజయ్‌ హజారే వన్డే టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: గత రెండు మ్యాచ్‌ల్లో వర్షం కారణంగా అనూహ్యంగా ఓటమి పాలైన హైదరాబాద్‌ జట్టు పుంజుకుంది. విజయ్‌ హజారే వన్డే టోర్నీలో రెండో విజయాన్ని అందుకుంది. ఎడంచేతి వాటం స్పిన్నర్‌ మెహదీ హసన్‌ (5/20) అద్భుత ప్రదర్శనకు తోడు బ్యాట్స్‌మెన్‌ రాణించడంతో ఘనవిజయాన్ని సాధించింది. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 9 వికెట్ల తేడాతో ఉత్తరప్రదేశ్‌ (యూపీ)పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఉత్తరప్రదేశ్‌ జట్టు... మెహదీ హసన్‌ ధాటికి 39.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. యూపీ కెప్టెన్‌ సురేశ్‌ రైనా (64 బంతుల్లో 53; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడటంతో జట్టు ఆ మాత్రమైనా స్కోరు సాధించగలిగింది. ఉపేంద్ర యాదవ్‌ (22), రైనా మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ హైదరాబాద్‌ బౌలర్ల ముందు నిలువలేకపోయారు. మెహదీ హసన్‌ 5 వికెట్లతో చెలరేగగా... సిరాజ్‌ 2 వికెట్లు దక్కించుకున్నాడు. సీవీ మిలింద్, ఆకాశ్‌ భండారి, సాకేత్‌ తలా ఓ వికెట్‌ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని హైదరాబాద్‌ 35.2 ఓవర్లలో వికెట్‌ నష్టపోయి ఛేదించింది. ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌ (101 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), అక్షత్‌ రెడ్డి (89 బంతుల్లో 64; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలతో రాణించడంతో హైదరాబాద్‌ 134 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.  

స్కోరు వివరాలు

ఉత్తర ప్రదేశ్‌ ఇన్నింగ్స్‌: శివమ్‌ ఎల్బీడబ్ల్యూ (బి) మిలింద్‌ 0; ఉపేంద్ర  (సి అండ్‌ బి) మెహదీ హసన్‌ 22; అభిషేక్‌ (సి) సుమంత్‌ (బి) మెహదీ హసన్‌ 16; ప్రియం గార్గ్‌ (బి) సాకేత్‌ 5; రైనా (సి) ఆశిష్‌ రెడ్డి (బి) సిరాజ్‌ 53; అ„Š దీప్‌ నాథ్‌ (సి) సుమంత్‌ (బి) భండారి 4; రింకూ సింగ్‌ ఎల్బీడబ్ల్యూ (బి) మెహదీహసన్‌ 17; శివసింగ్‌ (బి) మెహదీ హసన్‌ 6; శివం మావి (బి) మెహదీ హసన్‌ 1; అంకిత్‌ రాజ్‌పుత్‌ (బి) సిరాజ్‌ 0; రజత్‌ గోయల్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (39.1 ఓవర్లలో ఆలౌట్‌) 130.

వికెట్ల పతనం: 1–5, 2–27, 3–42, 4–49, 5–58, 6–117, 7–129, 8–129, 9–130, 10–130.
బౌలింగ్‌: సిరాజ్‌ 5.1–0–28–2, మిలింద్‌ 3–0–5–1, మెహదీ హసన్‌ 10–2–20–5, ఆకాశ్‌ భండారి 7–1–19–1, సాకేత్‌ 10–0–37–1, సందీప్‌ 3–0–9–0, రోహిత్‌ రాయుడు 1–0–10–0.

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: తన్మయ్‌ అగర్వాల్‌ నాటౌట్‌ 62; అక్షత్‌రెడ్డి (స్టంప్డ్‌) ఉపేంద్ర (బి) శివ సింగ్‌ 64; రోహిత్‌ రాయుడు నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (35.2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 134.  వికెట్ల పతనం: 1–124.

బౌలింగ్‌: అంకిత్‌ 5–2–5–0, శివం మావి 1–0–10–0, శివం చౌదరి 10–1–29–0, రజత్‌ గోయల్‌ 8.2–0–52–0, శివ సింగ్‌ 10–1–31–1, రింకూ సింగ్‌ 1–0–3–0.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు