హైదరాబాద్‌ ఘనవిజయం

1 Oct, 2018 10:14 IST|Sakshi

101 పరుగులతో ఛత్తీస్‌గఢ్‌పై గెలుపు

 రోహిత్‌ రాయుడు అర్ధసెంచరీ

 రాణించిన మెహదీ హసన్, సాకేత్‌

సాక్షి, హైదరాబాద్‌: బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో సమష్టిగా రాణించిన హైదరాబాద్‌ జట్టు విజయ్‌ హజారే వన్డే టోర్నీలో మూడో విజయాన్ని అందుకుంది. ఢిల్లీలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌పై 101 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 222 పరుగులు చేసింది. ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌ (16), అక్షత్‌ రెడ్డి (25; 4 ఫోర్లు) త్వరగానే పెవిలియన్‌ చేరినా... వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ కె. రోహిత్‌ రాయుడు (102 బంతుల్లో 75; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. బావనక సందీప్‌ (44; 1 ఫోర్, 1 సిక్స్‌)తో కలిసి నాలుగో వికెట్‌కు 77 పరుగుల్ని జోడించాడు. జట్టు స్కోరు 172 పరుగుల వద్ద అశుతోష్‌ సింగ్‌ బౌలింగ్‌లో సుమిత్‌కు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్‌ రాణించకపోవడంతో 222 పరుగుల వద్ద హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ప్రత్యర్థి బౌలర్లలో పంకజ్‌ రావు 3, సుమిత్‌ 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం 223 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఛత్తీస్‌గఢ్‌ను బౌలర్లు మెహదీ (3/19), సాకేత్‌ (3/28), ఆకాశ్‌ భండారి (2/31) కట్టడి చేశారు. వీరి ధాటికి ఛత్తీస్‌గఢ్‌ 33.3 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. తొమ్మిది జట్లున్న గ్రూప్‌ ‘బి’లో హైదరాబాద్‌ ఆరు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో గెలిచి, రెండింటిలో ఓడింది. మరో మ్యాచ్‌ రద్దయింది. ప్రస్తుతం హైదరాబాద్‌ 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్‌ తమ తదుపరి మ్యాచ్‌ల్లో 2న కేరళతో... 6న ఒడిశాతో ఆడనుంది.
 
స్కోరు వివరాలు

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: తన్మయ్‌ ఎల్బీడబ్ల్యూ (బి) జతిన్‌ 16; అక్షత్‌ రెడ్డి (సి) హర్‌ప్రీత్‌ (బి) సుమిత్‌ 25; రోహిత్‌ రాయుడు (సి) సుమిత్‌ (బి) అశుతోష్‌ 75; సుమంత్‌ (సి) హర్‌ప్రీత్‌ (బి) అజయ్‌ 13; సందీప్‌ (సి) అశుతోష్‌ (బి) పంకజ్‌ 44; ఆశిష్‌ (సి) జతిన్‌ (బి) పంకజ్‌ 14; ఆకాశ్‌ భండారి (సి) జతిన్‌ (బి) పంకజ్‌ 9; మిలింద్‌ రనౌట్‌ 8; సిరాజ్‌ (సి) అశుతోష్‌ (బి) సుమిత్‌ 4; మెహదీ హసన్‌ నాటౌట్‌ 3; సాకేత్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 222.

వికెట్ల పతనం: 1–44, 2–54, 3–95, 4–172, 5–195, 6–195, 7–213, 8–217, 9–217.
బౌలింగ్‌: పంకజ్‌ 10–0–41–3, విశాల్‌ సింగ్‌: 10–0–61–0, సుమిత్‌ 9–0–41–2, జతిన్‌ 10–0–34–1, అజయ్‌ 6–0–19–1, అశుతోష్‌ 5–0–21–1.
ఛత్తీస్‌గఢ్‌ ఇన్నింగ్స్‌: రిషభ్‌ (సి) సుమంత్‌ (బి) మెహదీ హసన్‌ 7; అశుతోష్‌ (బి) ఆకాశ్‌ భండారి 38; హర్‌ప్రీత్‌ (సి) మిలింద్‌ 2; అమన్‌దీప్‌ రనౌట్‌ 10; సంజీత్‌ (సి)భండారి (బి) సాకేత్‌ 2; మనోజ్‌ ఎల్బీడబ్ల్యూ (బి) సాకేత్‌ 5; అజయ్‌ (బి) ఆకాశ్‌ 3; విశాల్‌ (సి) సుమంత్‌ (బి) సాకేత్‌ 1; జతిన్‌ (సి) మిలింద్‌ (బి) మెహదీ హసన్‌ 37; సుమిత్‌ ఎల్బీడబ్ల్యూ (బి) మెహదీ హసన్‌ 11; పంకజ్‌ రావు నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (33.3 ఓవర్లలో ఆలౌట్‌) 121.
వికెట్ల పతనం: 1–34, 2–37, 3–60, 4–62, 5–64, 6–70, 7–73, 8–73, 9–94, 10–121.
బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–23–0, మిలింద్‌ 5–0– 20–1, మెహదీ హసన్‌ 7.3–1–19–3, సాకేత్‌ 8–1–28–3, ఆకాశ్‌ భండారి 9–0–31–2. 

మరిన్ని వార్తలు