మొదలైన పోలింగ్‌.. అధ్యక్షుడు ఎవరో?

27 Sep, 2019 10:13 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకే ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో 230 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. హెచ్‌సీఏ అధ్యక్షపదవి కోసం టీమిండియా మాజీ సారథి అజారుద్దీన్‌, దిలీప్‌ కుమార్‌, ప్రకాష్‌చంద్‌ జైన్‌లు ప్రధానంగా పోటీపడుతుండగా.. ఉపాధ్యక్ష పదవి కోసం జాన్‌ మనోజ్‌, సర్దార్‌ దల్దీత్‌ సింగ్‌లు రేసులో ఉన్నారు. 

హాట్‌ ఫేవరేట్‌గా అజారుద్దీన్‌..   
హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం ముగ్గురు పోటీ పడుతున్నా.. అందరి చూపు టీమిండియా మాజీ సారథి అజారుద్దీన్‌పైనే ఉంది. అజారుద్దీన్‌ కూడా తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. అయితే తన నామినేషన్‌ తిరస్కరణ కావడంతో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్‌ వెంకటస్వామి అజారుద్దీన్‌కు వ్యతిరేకంగా ప్రకాష్‌ ప్యానెల్‌కు మద్దతు ఇస్తున్నారు. దీంతో ఈ సారి అధ్యక్షుడు ఎవరనే దానిపై అందిరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక ఈ ఎన్నికల్లో అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు అజారుద్దీన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, వెంకటపతి రాజు, శివలాల్‌ యాదవ్‌, అర్షద్‌ ఆయుబ్‌, నోయల్‌ డేవిడ్‌, సాండ్రా బ్రగాంజ్‌, రజనీ వేణుగోపాల్‌, పూర్ణిమా రావు, డయానా డేవిడ్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మరిన్ని వార్తలు