ఐదేళ్ల తర్వాత సాధించారు

11 Dec, 2016 11:47 IST|Sakshi
ఐదేళ్ల తర్వాత సాధించారు

లక్నో: ఎట్టకేలకు హైదరాబాద్ జట్టు రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్‌కు అర్హత సాధించింది. ఆంధ్ర జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌ను డ్రా చేసుకున్న బద్రీనాథ్ బృందం గ్రూప్ ‘సి’లో టాపర్‌గా నిలిచింది. తద్వారా ఈ సీజన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిన హైదరాబాద్ జట్టు వచ్చే ఏడాది మేటి జట్లతో తలపడే అవకాశాన్ని పొందింది. ఐదేళ్ల తర్వాత మన జట్టు ‘ఎలైట్’ ఇన్నింగ్‌‌స ఆడనుంది. గతంలో 2011లో చివరిసారిగా హైదరాబాద్ జట్టు ఎలైట్‌లో ఆడింది.

 మంచుకురిసే వేళలో...: రెండో రోజులాగే శనివారం చివరి రోజు కూడా లంచ్ విరామం తర్వాత... చాలా ఆలస్యంగా ఆట మొదలైంది. పొద్దుపోయాక కూడా ఎంతకీ తెరిపినివ్వని పొగమంచు ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో తొలి సెషన్ అంతా మంచుదుప్పటిలో తుడిచిపెట్టుకుపోయింది. తర్వాత కేవలం 40 ఓవర్ల ఆటే సాగింది. చివరకు డ్రా ఫలితంతో ఆంధ్ర జట్టు 3, హైదరాబాద్ ఒక పాయింట్ పొందాయి. దీంతో హైదరాబాద్ 31 పారుుంట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

 మళ్లీ తడబాటు...: నాలుగో రోజు 219 పరుగుల లక్ష్యంతో 13/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్‌‌స కొనసాగించిన హైదరాబాద్ మ్యాచ్ ముగిసే సమయానికి 47 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. టాప్‌ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మళ్లీ రెండో ఇన్నింగ్‌‌సలోనూ తడబడ్డారు. ఆట మొదలైన తొలి ఓవర్లోనే అనిరుధ్ (2) శివకుమార్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. దీంతో ఓవర్‌నైట్ స్కోరు వద్దే రెండో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత ఓపెనర్ అక్షత్ రెడ్డి (5), బావనక సందీప్ (13) జతరుునప్పటికీ... వీరిద్దరూ ఎక్కువసేపు నిలువలేకపోయారు. అనంతరం వచ్చిన హిమాలయ్ అగర్వాల్ (0) కూడా చేతులెత్తేయడంతో హైదరాబాద్ 36 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోరుు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ బద్రీనాథ్ (14 నాటౌట్), కొల్లా సుమంత్ (10 నాటౌట్) మరో వికెట్ పడకుండా 20 ఓవర్లపాటు జాగ్రత్తగా ఆడారు. మ్యాచ్ నిలిచే సమయానికి నాటౌట్‌గా నిలిచారు. ఆంధ్ర బౌలర్లలో విజయ్ కుమార్ 2, భార్గవ్ భట్, శివకుమార్ చెరో వికెట్ తీశారు.

 స్కోరు వివరాలు
 ఆంధ్ర తొలి ఇన్నింగ్‌‌స: 190; హైదరాబాద్ తొలి ఇన్నింగ్‌‌స: 143; ఆంధ్ర రెండో ఇన్నింగ్‌‌స: 171/6 డిక్లేర్డ్
 హైదరాబాద్ రెండో ఇన్నింగ్‌‌స: తన్మయ్ రనౌట్ 9; అక్షత్ రెడ్డి (సి) భార్గవ్ (బి) విజయ్ కుమార్ 5; అనిరుధ్ (బి) శివకుమార్ 2; సందీప్ (సి) ప్రణీత్ (బి) భార్గవ్ 13; బద్రీనాథ్ నాటౌట్ 14; హిమాలయ్ (సి) భరత్ (బి) విజయ్ కుమార్ 0; సుమంత్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (47 ఓవర్లలో 5 వికెట్లకు) 56.

 వికెట్ల పతనం: 1-9, 2-13, 3-28, 4-30, 5-36.
 బౌలింగ్: విజయ్ కుమార్ 19-12-13-2, స్టీఫెన్ 6-3-10-0, భార్గవ్ భట్ 14-3-21-1, శివకుమార్ 7-3-12-1, రవితేజ 1-1-0-0.


 

మరిన్ని వార్తలు