హడలెత్తించిన ముదస్సర్‌

19 Nov, 2017 10:51 IST|Sakshi

ఐదు వికెట్లతో చెలరేగిన హైదరాబాద్‌ పేసర్‌

ఫాలోఆన్‌లో అస్సాం

పట్టు బిగించిన హైదరాబాద్‌  

గువాహటి: హైదరాబాద్‌ జట్టుకు ఎంతో కీలకమైన మ్యాచ్‌లో బౌలర్‌ ముదస్సర్‌ హుస్సేన్‌ (5/36) అద్భుత ప్రదర్శనతో జట్టును ఆదుకున్నాడు. ముదస్సర్‌తో పాటు మిగతా బౌలర్లు కూడా సమష్టిగా రాణించడంతో గువాహటిలో అస్సాంతో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఒకేరోజు 12 వికెట్లు నేలకూలాయి. దీంతో హైదరాబాద్‌కు 190 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. రెండోరోజు శనివారం ఆటలో ఓవర్‌నైట్‌ స్కోరు 289/8తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్‌ 90.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్‌ భండారి (71; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ చేయడంతో జట్టు స్కోరు 300 పరుగులు దాటింది. అస్సాం బౌలర్లలో అరూప్‌ దాస్‌ 5, రాహుల్‌ సింగ్‌ 3 వికెట్లను దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అస్సాం జట్టును హైదరాబాద్‌ బౌలర్లు ముదస్సర్, రవికిరణ్‌ (3/30) వణికించారు. వీరిద్దరి ధాటికి అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 48.5 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ గోకుల్‌ శర్మ (39) మినహా మిగతావారు విఫలమయ్యారు. సుదీప్‌ త్యాగి, ఆకాశ్‌ భండారి చెరో వికెట్‌ పడగొట్టారు. అనంతరం ఫాలోఆన్‌ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అస్సాం జట్టు శనివారం ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో 2 వికెట్లకు 36 పరుగులు చేసింది. రవికిరణ్, రవితేజ చెరో వికెట్‌ పడగొట్టారు. ప్రస్తుతం అస్సాం 154 పరుగులు వెనుకబడి ఉంది.  

స్కోరు వివరాలు  

హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌: 326 ఆలౌట్‌; అస్సాం తొలి ఇన్నింగ్స్‌: రియాన్‌ పరాగ్‌ (బి) ముదస్సర్‌ 9; రిషవ్‌ దాస్‌ ఎల్బీడబ్ల్యూ (బి) సుదీప్‌ త్యాగి 28; శిబ్‌శంకర్‌ రాయ్‌ ఎల్బీడబ్ల్యూ (బి) రవికిరణ్‌ 14; గోకుల్‌ శర్మ (బి) ముదస్సర్‌ 39; అమిత్‌ సిన్హా (సి) సుమంత్‌ (బి) ఆకాశ్‌ 20; రహమాన్‌ (సి) సందీప్‌ (బి) ముదస్సర్‌ 7; రజత్‌ఖాన్‌ (సి) ఆకాశ్‌ (బి) ముదస్సర్‌ 0; రజాకుద్దీన్‌ అహ్మద్‌ (సి) సుమంత్‌ (బి) రవికిరణ్‌ 1; ప్రీతమ్‌ దాస్‌ (సి) సుమంత్‌ (బి) రవికిరణ్‌ 0; అరూప్‌ దాస్‌ నాటౌట్‌ 8; రాహుల్‌ సింగ్‌ (సి) రవికిరణ్‌ (బి) ముదస్సర్‌ 4; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్‌) 136.  
వికెట్ల పతనం: 1–19, 2–48, 3–66, 4–112, 5–122, 6–123, 7–124, 8–124, 9–124, 10–136.  
బౌలింగ్‌: రవికిరణ్‌ 13–3–30–3, ముదస్సర్‌ 11.5–3–36–5, సుదీప్‌ త్యాగి 9–2–22–1, రవితేజ 9–1–28–0, మెహదీ హసన్‌ 4–1–3–0, ఆకాశ్‌ భండారి 2–0–14–1.  

అస్సాం రెండో ఇన్నింగ్స్‌: రియాన్‌ పరాగ్‌ (సి) సుమంత్‌ (బి) రవికిరణ్‌ 3; రిషవ్‌ దాస్‌ బ్యాటింగ్‌ 12; శిబ్‌శంకర్‌ రాయ్‌ (బి) రవితేజ 4; గోకుల్‌ శర్మ బ్యాటింగ్‌ 17; మొత్తం (15 ఓవర్లలో 2 వికెట్లకు)36.
వికెట్ల పతనం: 1–8, 2–15.
బౌలింగ్‌: రవికిరణ్‌ 5–0–8–1, రవితేజ 5–0–15–1, సుదీప్‌ త్యాగి 2–0–6–0, ముదస్సర్‌ 2–1–7–0, మెహదీ హసన్‌ 1–1–0–0.

మరిన్ని వార్తలు