నేను ఎందుకు హెల్మెట్‌ వాడలేదంటే...

23 Aug, 2019 10:07 IST|Sakshi

కోహ్లికి రిచర్డ్స్‌ సమాధానం

నార్త్‌సౌండ్‌ (ఆంటిగ్వా): వెస్టిండీస్‌ దిగ్గజం సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ బ్యాటింగ్‌ విధ్వంసం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హెల్మెట్‌ కూడా వాడకుండా నాటి పేస్‌ బౌలర్లపై అతను తనదైన శైలిలో విరుచుకు పడ్డాడు. ఇటీవల ఆర్చర్‌ బౌలింగ్‌లో స్మిత్‌ గాయపడిన తర్వాత హెల్మెట్ల వాడకంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో అతను దీనిపై స్పందించాడు. మరో స్టార్‌ క్రికెటర్, భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యాఖ్యాతగా మారి అడిగిన ఈ ప్రశ్నకు అతను జవాబిచ్చాడు.

‘నేను మగాడిని. నేను ఇలా చెబితే దురుసుగా అనిపించవచ్చు కానీ అది నాపై నాకున్న నమ్మకం. నాకు నచి్చన ఆటనే ఆడుతున్నానని నేను నమ్మాను. నా ఆటపై నాకు విశ్వాసం ఎక్కువ. ఈ క్రమంలో గాయపడేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. నేను హెల్మెట్‌ వాడే ప్రయత్నం చేసినప్పుడు అసౌకర్యంగా అనిపించింది. నాకు ఇచి్చన టీమ్‌ క్యాప్‌ను చూసే నేను గర్వపడ్డాను. ఇక్కడ నిలబడే స్థాయి నాకు ఉందనేది తెలుసు. నేను నిజంగా గాయపడితే  బయటపడటం కూడా దేవుడి చేతుల్లోనే ఉంది’ అని రిచర్డ్స్‌ వివరించాడు. దీంతో పాటు పలు ఆసక్తికర అంశాలపై రిచర్డ్స్‌ను కోహ్లి ఇంటర్వ్యూ చేశాడు. 

మరిన్ని వార్తలు