‘నేను చాలా ప్రమాదకరమైన బౌలర్‌ని’

8 Jul, 2019 19:43 IST|Sakshi

మాంచెస్టర్‌: తానొక ప్రమాదకరమైన బౌలర్‌ని అంటూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నవ్వులు పూయించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మంగళవారం సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ప్రిమ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో కోహ్లి మాట్లాడాడు. ‘నేను ఏ సమయంలోనైనా బౌలింగ్‌ చేయగలను. నేను చాలా ప్రమాదకరమైన బౌలర్‌ని. కాకపోతే బౌలింగ్‌ చేయడం లేదంతే. మా ఐదుగురు బౌలర్లు తమ పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అందుచేత నేను బౌలింగ్‌కు దూరంగా ఉన్నా’ అని కోహ్లి సరదా సరదాగా మాట్లాడాడు.

ఇక బ్యాటింగ్‌ ఆర్డర్‌ గురించి తమకు ఎటువంటి ఆందోళన లేదన్నాడు. పరిస్థితులకు తగ్గట్టు అందరూ ఆడటమే ఇందుకు కారణమన్నాడు. మ్యాచ్‌ పరిస్థితిని బట్టే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేస్తామన్నాడు. న్యూజిలాండ్‌ జట్టులో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌లతో పాటు రాస్‌ టేలర్‌లే కీలకమన్నాడు. వీరిద్దర్నీ తొందరగా పెవిలియన్‌కు పంపి కివీస్‌పై ఒత్తిడి తీసుకొస్తామని కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు