4 Jun, 2018 18:42 IST|Sakshi

సిడ్నీ: బాల్‌ ట్యాపరింగ్‌ కుంభకోణం వెలుగుచూసిన తర్వాత మొదటి నాలుగు రోజులు తాను ఏడుస్తూనే గడిపానని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నారు. క్రికెట్‌ ఆస్ట్రేలియాను కుదిపేసిన బ్యాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో స్టీవ్‌ స్మిత్‌తోపాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌, కామెరాన్‌ బెన్‌క్రాఫ్ట్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. స్మిత్‌, వార్నర్‌ ఏడాది దేశీయ, అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకుండా నిషేధించగా.. బెన్‌క్రాఫ్ట్‌పై 9నెలల నిషేధం విధించారు. అయితే, స్మిత్‌, వార్నర్‌ వచ్చే నెలలో జరగనున్న గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌ అనే ప్రైవేటు టోర్నీలో పాలుపంచుకుంటున్నారు. టోరంటో నేషనల్స్‌ జట్టు తరఫున స్మిత్‌ ఆడనున్నాడు.

ఈ టోర్నీలో తనకు లభించే మ్యాచ్‌ ఫీజును పూర్తిగా ఆస్ట్రేలియాలో క్రికెట్‌ అభివృద్ధికి విరాళంగా ఇవ్వనున్నట్టు స్మిత్‌ ప్రకటించాడు. ఈ సందర్భంగా సిడ్నీ నాక్స్‌ గ్రామర్‌ స్కూల్‌లో విద్యార్థులతో స్మిత్‌ మాట్లాడుతూ.. ‘నిజాయితీగా చెప్పాలంటే నాలుగు రోజులు నేను ఏడుస్తూనే ఉన్నాను. మానసికంగా నేను ఎంతో క్షోభ అనుభవించాను. కుటుంబసభ్యులు, స్నేహితులు ఆ సమయంలో నాకు ఎంతో అండగా నిలబడ్డారు. వాళ్లు రోజంతా నాతో మాట్లాడుతూ గడిపారు. వాళ్లు నాతో ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. వాళ్లు ఇచ్చిన మద్దతు, నైతిక ధైర్యం కారణంగానే నేను ఇలా మీముందు నిలబడగలిగాను’ అని అన్నాడు. ఈ మేరకు అతడి మాటల ఆడియో టేపును సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ పత్రిక విడుదల చేసింది.  స్మిత్‌, వార్నరే కాదు.. కీరన్‌ పొలార్డ్‌, క్రిస్‌ గేల్‌, అండ్రూ రస్సెల్‌, టిమ్‌ సౌథీ, షాహిద్‌ ఆప్రిదీ, సునీల్‌ నరైన్‌, క్రిస్‌ లిన్‌ వంటి ప్రముఖ ఆటగాళ్లు గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో ఆడుతున్నారు.

టోర్నీలో ఆడబోయే జట్లు ఇవే..
టోరంటో నేషనల్స్: డారెన్ సమ్మీ, స్టీవ్ స్మిత్, కీరన్ పొల్లార్డ్, కమ్రాన్ అక్మల్, హుస్సేన్ తలత్, రుమాన్‌ రయిస్‌, నిఖిల్ దత్తా, జాన్సన్ చార్లెస్, కేస్రిర్‌ విలియమ్స్, నవిద్ అహ్మద్, నిజాకత్‌ ఖాన్, ఫర్హాన్ మాలిక్, నితీష్ కుమార్, ఒసామా మీర్, రోహన్ ముస్తఫా, మహ్మద్ ఘనీ. కోచ్: ఫిల్ సిమన్స్

వాంకోవర్ నైట్స్: క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, ఎవిన్‌ లెవిస్, టిమ్ సౌథీ, చాడ్విక్ వాల్టన్, ఫవాద్ అహ్మద్, బాబర్ హయత్, షెల్డన్ కాట్రెల్, సాద్ బిన్ జాఫర్, రువిందు గుణశేఖర, శ్రీమంత విజేరత్న, కామౌ లెవరాక్‌, స్టీవెన్ జాకబ్స్, సల్మాన్ నాజర్, రస్సీ వాన్ డెర్ డుస్సేన్‌, జెరెమీ గోర్డాన్. కోచ్: డోనోవన్ మిల్లెర్

ఎడ్‌మంటన్ రాయల్స్: షాహిద్ ఆఫ్రిది, క్రిస్ లిన్, ల్యూక్ రాంచి, మహమ్మద్ ఇర్ఫాన్, సోహైల్ తన్వీర్, క్రిస్టియన్‌ జాంకర్‌, వేన్ పార్నెల్, ఆసిఫ్ ఆలీ, హసన్ ఖాన్, అఘా సల్మాన్, షాయ్మన్‌ అన్వర్, అమ్మార్ ఖలీద్, సత్‌సిమ్రంజిత్‌ ధిండ్సా, అహ్మద్ రజా, సైమన్ పర్వేజ్, అబ్రాష్‌ ఖాన్. కోచ్ : మహమ్మద్ అక్రం

మాంట్రియల్ టైగర్స్: లసిత్ మలింగ, సునీల్ నరైన్,  థిసరా పెరెరా, మహ్మద్ హఫీజ్, దినేష్ రామ్దిన్, సందీప్ లిమిచానె, సికందర్ రజా, దాసున్‌ శంక, ఇసురు ఉదాన, జార్జ్ వర్కర్, నజిబుల్లా జద్రాన్‌, సెసిల్ పర్వేజ్, ఇబ్రహీం ఖలీల్, డిల్లాన్ హెలింగర్‌, నికోలస్ కిర్టన్‌, రయాన్‌ పఠాన్ . కోచ్: టామ్ మూడీ

విన్నిపెగ్ హాక్స్: డ్వేన్‌ బ్రేవో, డేవిడ్ మిల్లర్, డేవిడ్ వార్నర్, లెండిల్ సిమ్మన్స్, డారెన్ బ్రేవో, ఫిడేల్ ఎడ్వర్డ్స్, రయాద్ ఎమ్రిట్‌‌, బెన్ మెక్‌ డార్మట్, ఆలీ ఖాన్, హంజా తారిక్, జునైద్ సిద్ధిఖీ, టియాన్‌ వెబ్స్టర్, రిజ్వాన్ చీమా, హిరల్‌ పటేల్, మార్క్ డెయాల్‌, కైల్ ఫిలిప్ . కోచ్: వకార్ యూనిస్

మరిన్ని వార్తలు