ఇంగ్లండ్‌ను చూస్తే బాధేస్తోంది: మిథాలీ

5 Mar, 2020 16:14 IST|Sakshi
మిథాలీ రాజ్‌(ఫైల్‌ఫొటో)

న్యూఢిల్లీ:  మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ ఫైనల్‌ చేరడంపై మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ హర్షం వ్యక్తం చేశారు. మహిళల టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో భారత్‌ ఫైనల్‌కు చేరడం కచ్చితంగా అతి పెద్ద ఘనతేనని ఆమె అభివర్ణించారు. ఈ మేరకు తన ట్వీటర్‌ అకౌంట్‌లో  కంగ్రాట్స్‌ అంటూ హర్మన్‌ ప్రీత్‌ అండ్‌ గ్యాంగ్‌కు అభినందనలు తెలిపిన మిథాలీ.. ఇంగ్లండ్‌ మహిళల పట్ల మాత్రం సానుభూతి వ్యక్తం చేశారు. ‘ ఒక భారతీయరాలిగా భారత్‌ ఫైనల్‌ చేరడాన్ని థ్రిల్‌గా ఫీలవుతా. కానీ ఒక క్రికెటర్‌గా ఇంగ్లండ్‌ గర్ల్స్‌ను చూస్తే జాలేస్తోంది. (ఫైనల్‌కు టీమిండియా తొలిసారి)

ఈ తరహా పరిస్థితిని నేను ఎప్పుడూ కోరుకోను. నా జట్టుకి కూడా రాకూడదు.  కాకపోతే రూల్స్‌ ను పాటించాలి కాబట్టి మనం చేసేది ఏమీ ఉండదు. కంగ్రాట్స్‌ గర్ల్స్‌. ఇదొక పెద్ద ఘనత’ అని మిథాలీ పేర్కొన్నారు. వర్షం కారణంగా  ఇంగ్లండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌ రద్దు కావడంతో గ్రూప్‌ స్టేజ్‌లో టాపర్‌గా ఉన్న భారత్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. కాకపోతే వర్షం రావడం ఇంగ్లండ్‌కు శాపంగా మారింది. రిజర్వ్‌ డే లేని కారణంగా నాకౌట్‌ మ్యాచ్‌ ఆడకుండానే ఇంగ్లండ్‌ ఇంటి దారి పట్టింది. 

మహిళల టి20 ప్రపంచ కప్‌ చరిత్రలో భారత జట్టు తొలిసారి ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీల్లో ఇప్పటివరకూ మూడు సందర్భాల్లో సెమీస్‌ వరకే పరిమితమైన భారత మహిళలు.. ఈసారి మాత్రం తుది పోరుకు అర్హత సాధించారు. ఈ రోజు ఇంగ్లండ్‌తో జరగాల్సిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో గ్రూప్‌-ఎలో అజేయంగా నిలిచిన భారత్‌ ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకుంది. భారీ వర్షం కారణంగా కనీసం టాస్‌ కూడా పడకుండానే గేమ్‌ రద్దయ్యింది. (ఐసీసీపై మార్క్‌ వా ఫైర్‌)

మరిన్ని వార్తలు