నేను సిక్స్‌ కొట్టగలననే అనుకున్నా: దినేశ్‌ కార్తీక్‌

14 Feb, 2019 09:40 IST|Sakshi

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో ఆఖరిదైన మూడో టీ20లో టీమిండియా గెలుపు అంచుల వరకూ వచ్చి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కివీస్‌ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ 208 పరుగులు మాత్రమే చేసి నాలుగు పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఆ మ్యాచ్‌ గెలవాలంటే చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాలి. మూడో బంతికి తేలిగ్గా సింగిల్‌ వచ్చే అవకాశమున్నా దినేశ్‌ కార్తీక్‌ పరుగు తీయలేదు. భారీ షాట్లు ఆడగలిగే కృనాల్‌ పాండ్యా సగం పిచ్‌ దాటేసి పరుగెత్తుకుంటూ వచ్చినా.. దినేశ్‌ కార్తీక్‌ వద్దంటూ సింగిల్‌కు నిరాకరించడం చర్చనీయాంశమైంది. దానిపై దినేశ్‌ కార్తీక్‌పై అభిమానులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

దీనిపై ఇప్పుడు కార్తీక్‌ స్పందించాడు. ‘అప్పటికి నేను, కృనాల్‌ బాగా బ్యాటింగ్‌ చేస్తున్నాం. లక్ష్యాన్ని పూర్తి చేయగలమనే నమ్మకంతో ఉన్నాం. సింగిల్‌కు తిరస్కరించిన తర్వాత సిక్స్‌ కొట్టగలనని నిజంగా అనుకున్నా.మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా ఒత్తిడిలో భారీ షాట్లు ఆడగల నా సామర్థ్యాన్ని నేను నమ్మాలి. భాగస్వామిని నమ్మడం కూడా ముఖ్యం. అయితే నేను అనుకున్నట్లుగా ఆడలేకపోయా. క్రికెట్‌లో అలాంటివి సహజం’ అని తెలిపాడు.

ఇక్కడ చదవండి: కార్తీక్‌.. నువ్వు ధోని అనుకుంటున్నావా?

>
మరిన్ని వార్తలు