ఒలింపిక్స్‌ కోసం సిద్ధంగా ఉంటా: మను  

23 Mar, 2020 10:06 IST|Sakshi

న్యూఢిల్లీ: క్రీడా ఈవెంట్‌ల వాయిదా, శిక్షణా శిబిరాల రద్దు అనేవి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చిన్న విషయాలని... ప్రపంచం ముందు కరోనా రూపంలో అతిపెద్ద సవాలు నిలిచిందని భారత 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ స్టార్‌ షూటర్‌ మను భాకర్‌ పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధనలు పాటిస్తూ రానున్న విశ్వ క్రీడల కోసం సిద్ధమవుతున్నట్లు 18 ఏళ్ల మను తెలిపింది. ‘ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నా. అయినప్పటికీ నా ఒలింపిక్స్‌ సన్నాహాలను ఆపలేదు. యోగా, మెడిటేషన్‌తో సాంత్వన పొందుతున్నా. ఎప్పుడు ఒలింపిక్స్‌ జరిగినా సిద్ధంగా ఉండాలనేది నా ఆలోచన. దీనికి తగినట్లుగా ప్రాక్టీస్‌ చేస్తున్నా’ అని కామన్వెల్త్‌ గేమ్స్, యూత్‌ ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత మను భాకర్‌ తెలిపింది. 

మరిన్ని వార్తలు