‘ఆ జట్లే వరల్డ్‌కప్‌ హాట్‌ ఫేవరెట్స్‌’

7 Feb, 2019 10:56 IST|Sakshi

సిడ్నీ: ఇంకా వరల్డ్‌కప్‌ ప్రారంభం కావడానికి దాదాపు మూడు నెలల సమయం ఉండగానే ఏ జట్టు టైటిల్‌ గెలుస్తుందనే దానిపై విశ్లేషణలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు క్రీడా విశ్లేషకులు వరల్డ్‌కప్‌ గెలిచే సత్తా భారత్, ఇంగ్లండ్‌ జట్లకు మాత్రమే ఉందని స్పష్టం చేయగా, ఆ జాబితాలో ఇప్పుడు ఆసీస్‌ దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ కూడా చేరిపోయాడు. మెగా టైటిల్‌ను ఎగురేసుకుపోయే జాబితాలో భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు ముందు వరుసలో ఉన్నాయని పేర్కొన్నాడు. ఈ రెండు జట్లు వరల్డ్‌కప్‌కు హాట్‌ ఫేవరెట్స్‌గా బరిలో దిగుతున్నాయన్నాడు. ఇక ఆసీస్‌కు కూడా అవకాశాలు లేకపోలేదని తెలిపాడు. అయితే ఇక్కడ తాను అనుకున్న జట్టుతో ఆసీస్‌ పోరుకు సిద్ధమైతే వరల్డ్‌కప్‌ వేటలో తమ జట్టు కూడా ఫేవరెట్‌గా ఉంటుందన్నాడు.

‘ఈసారి భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు ప్రపంచకప్‌లో హాట్‌ ఫేవరెట్లుగా టైటిల్‌ వేటకు సిద్ధమవుతున్నాయి.  ఈ రెండు గట్టిపోటీ ఇచ్చే జట్లే. ఇరు జట్లలోనూ మంచి బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు ఉన్నారు. అయితే ఆసీస్‌ సెలక్టర్లు వారి బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తే ఆసీస్‌ కప్‌ గెలవడానికి 100శాతం అవకాశముంది. ప్రధానంగా భారత్‌, ఇంగ్లండ్‌లతో పాటు ఆసీస్‌ కూడా వరల్డ్‌కప్‌ గెలిచే అవకాశం ఉంది’ అని షేన్‌ వార్న్‌ తెలిపాడు.
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ రెండు జట్లే వరల్డ్‌కప్‌ ఫేవరెట్స్‌: మెక్‌గ్రాత్‌

25 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు..

రాష్ట్ర త్రోబాల్‌ జట్టులో సమీనా, మాథ్యూ

భారత స్పీడ్‌బాల్‌ జట్టు కెప్టెన్‌గా రఘు

చాంప్స్‌ అక్షయ, పవన్‌ కార్తికేయ

అజయ్, మిథున్‌ పరాజయం

భారత్‌ ఖేల్‌ ఖతం 

మెయిన్‌ ‘డ్రా’కు ప్రజ్నేశ్‌ 

పుల్వామా బాధిత కుటుంబాలకు సీఎస్‌కే విరాళం 

మూడో సారి ‘సూపర్‌’ 

‘రైజింగ్‌’కు రెడీ

రోహిత్‌ ‘ఫోర్‌’ కొడతాడా! 

ఐపీఎల్‌ ప్రసారాలను నిషేధిస్తున్నాం!

ఐపీఎల్‌ విజేతలు వీరే..

దురదృష్టమంటే నీదే నాయనా?

దానికి సమాధానం కోహ్లి దగ్గరే!

కార్పొరేట్‌ స్పోర్ట్స్‌ మీట్‌ షురూ

తెలంగాణ త్రోబాల్‌ జట్ల ప్రకటన

వార్నర్‌కు సరితూగలేరెవ్వరూ...

ఇండియా ఓపెన్‌ నుంచి వైదొలిగిన సైనా నెహ్వాల్‌ 

భారత్‌కు చుక్కెదురు 

టోక్యో ఒలింపిక్స్‌ టార్చ్‌ ఆవిష్కరణ 

ఎదురులేని భారత్‌

ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్, మిథున్‌

ఉత్కం‘టై’న మ్యాచ్‌లో సఫారీ ‘సూపర్‌’ విక్టరీ 

ఆ సంగతి ఆటగాళ్లకు బాగా తెలుసు 

ముంబై ముచ్చటగా...

అంతా ధోనిమయం!

మూడో టైటిల్‌ వేటలో...

టీమిండియాకు అదో హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విక్రమ్ సహిదేవ్ హీరోగా ‘ఎవడు తక్కువకాదు’

‘కాదండి.. బాధ ఉండదండి..’

అది మా ఆయనకు నచ్చదు : సమంత

‘తుగ్లక్‌’గా నందమూరి హీరో

హీరోగా యాంకర్‌ ప్రదీప్‌

సినిమా చూపిస్త మావా..