దిగ్గజాలతో ఆడటం నా అదృష్టం

10 Apr, 2015 02:12 IST|Sakshi

వారి వల్లే విజయాల్లో భాగమయ్యా
హర్భజన్ సింగ్ వ్యాఖ్య

 
కోల్‌కతా : క్రికెటర్‌గా తన కెరీర్ విజయవంతం కావడంలో పలువురు భారత దిగ్గజాల పాత్ర ఉందని ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. వారితో కలిసి ఆడటం వల్లే తానూ విజయాల్లో భాగం అయ్యానని, అదో ‘బంగారు తరం’గా అతను అభివర్ణించాడు. ‘సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలతో కలిసి ఆడటం నా అదృష్టం. వారి వద్దనుంచి ఎంతో నేర్చుకున్నాను. వారి వల్లే నా కెరీర్ విజయవంతంగా సాగింది. ముఖ్యంగా గంగూలీ నాయకత్వ లక్షణాలు ప్రత్యేకం.

అతనో గొప్ప కెప్టెన్’ అని భజ్జీ అన్నాడు. కోల్‌కతా నగర శివార్లలో రాజర్హట్ వద్ద భజ్జీ ‘హర్భజన్ సింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్’ పేరుతో తన సొంత అకాడమీని ప్రారంభించాడు. చిన్నారుల్లో ఉన్న సహజ సిద్ధమైన నైపుణ్యాన్ని మార్చే ప్రయత్నం చేయవద్దని, ప్రతీ ఆటగాడికి సొంత శైలి ఉంటుందని భజ్జీ చెప్పాడు. ఎవరినీ అనుకరించడం మంచిది కాదని, సెహ్వాగ్, కోహ్లిలు సొంత టెక్నిక్‌తోనే ఎదిగారని హర్భజన్ గుర్తు చేశాడు.

మరిన్ని వార్తలు