'క్రికెట్ ను వదిలేయమన్నారు'

16 Feb, 2017 12:57 IST|Sakshi
'క్రికెట్ ను వదిలేయమన్నారు'

సెంచూరియన్: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో కీలక క్రికెటరైన మోర్నీ మోర్కెల్ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడి దాదాపు ఎనిమిది నెలలు అయ్యింది. గతేడాది జూన్ లో వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే ఆ సమయంలో తాను ఇక క్రికెట్ ను ఆడటానికి పనికిరానని డాక్టర్లు సలహా ఇవ్వడం తీవ్రమైన వేదనకు గురిచేసిందని మోర్కెల్ తాజాగా స్సష్టం చేశాడు. ప్రస్తుతం మొమెంటమ్ వన్డే కప్ మ్యాచ్ ఆడనున్న మోర్కెల్... తాను పూర్తిస్థాయిలో ఫిట్ నెస్ ను నిరూపించుకుని మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడతాననే ఆశాభావం వ్యక్తం చేశాడు.


'గతంలోనే నన్ను క్రికెట్ ను వదిలేయమనే సలహా డాక్టర్లు ఇచ్చారు. నేను వెన్నునొప్పితో బాధపడుతున్న తరుణంలో క్రికెట్ నుంచి దూరంగా ఉండమని ఒక డాక్టర్ చెప్పాడు. ఇక నేను క్రికెట్ ఆడటానికి పని చేయనని తేల్చిచెప్పాడు. ఆ క్షణంలోనే నా క్రికెట్ కెరీర్ పై అనుమానం వచ్చింది. ఇక క్రికెట్ ను ఆడగలనా?అనే సందేహం నన్ను ఆందోళనలో పడేసింది. అయితే అప్పట్నుంచి నా ఫిట్ నెస్ నిరూపించకోవడం కోసం శ్రమిస్తూనే ఉన్నా. ఆ డాక్టర్ ఇచ్చిన సలహా పక్కను పెట్టేశా.  నాకు నేనుగా వెన్నునొప్పి నుంచి బయట పడేందుకు కష్టపడుతూనే ఉన్నా. ఆ క్రమంలోనే వేరే డాక్టర్ల సలహాలను కూడా తీసుకున్నా. ఇప్పుడు వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్నా. త్వరలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే దక్షిణాఫ్రికా జట్టులో చోటు కూడా దక్కించుకుంటా' అని మోర్కెల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు