వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు:భువనేశ్వర్ కుమార్

9 Apr, 2015 11:44 IST|Sakshi
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు:భువనేశ్వర్ కుమార్

హైదరాబాద్: టీమిండియా జట్టులో్కి వచ్చిన కొద్ది రోజుల్లోనే కీలక బౌలర్ గా ఎదిగిన భువనేశ్వర్ కుమార్ గత కొన్నిరోజులుగా గాయం కారణంగా ఫామ్ ను కోల్పోయి తంటాలు పడుతున్నాడు. వరల్డ్ కప్ టోర్నీకి ఎంపికైనా.. దాదాపు అన్ని మ్యాచ్ లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే తాజాగా ఐపీఎల్-8 సీజన్ కు సన్ రైజర్ప్ హైదరాబాద్ తరుపున ఆడుతున్న భువీ.. తన బౌలింగ్ శైలిపై ఎట్టిపరిస్ధితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నాడు.'చాలా రోజుల తరువాత క్రికెట్ ఫీల్డ్ లోకి అడుగుపెడుతున్నా. నా బౌలింగ్ లో ఎటువంటి మార్పు ఉండదు. వేగంతో కూడిన స్వింగ్ చేసి ఆకట్టుకుంటా. ఈ విషయంలో వెనక్కి తగ్గను' అని భువనేశ్వర్ కుమార్ తెలిపాడు.

ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ లు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన వరల్డ్ కప్ లో యూఏఈ మ్యాచ్ లో మాత్రం భువనేశ్వర్ కుమార్ ఆడాడు. అంతకుముందు ప్రాక్టీస్ సెషన్ లో ఆకట్టుకున్నా.. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో అయిన గాయం కారణంగా వరల్డ్ కప్ మ్యాచ్ లకు దూరం అయ్యాడు. సుదీర్ఘ విరామం అనంతరం బరిలోకి దిగుతున్న భువీ.. మళ్లీ తిరిగి పూర్వ వైభవాన్ని చాటుకుంటానని తాజాగా స్పష్టం చేశాడు.

మరిన్ని వార్తలు