‘మళ్లీ అతనికి కెప్టెన్సీ వద్దే వద్దు’

29 Mar, 2018 12:09 IST|Sakshi

మెల్‌బోర్న్‌: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో ట్యాంపరింగ్‌ ఉదంతంతో ఏడాది పాటు నిషేధానికి గురైన కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌పై ఆ దేశ దిగ్గజ ఆటగాడు ఇయాన్‌ చాపెల్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆస్ట్రేలియా క్రికెట్‌ పరువు మంటగలిపిన స్మిత్‌కు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డేవిడ్‌ వార్నర్‌ శాశ్వతంగా కెప్టెన్‌ కాకుండా సీఏ ఎలాంటి నిర్ణయం తీసుకుందో, స్మిత్‌పై కూడా అవే తరహాలో చర్యలు తీసుకుంటే బాగుండేదన్నారు. ఇక ఆసీస్‌ జట్టుకు స్మిత్‌ను సారథిగా చూడాలని తాను అనుకోవడం లేదని ఇయాన్‌ చాపెల్‌ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

'స్మిత్‌ను మళ్లీ కెప్టెన్‌గా చూడాలని అనుకోవడం లేదు. ఒక కెప్టెన్‌ అయిన వ్యక్తి ఎంతో హుందాగా వ్యవహరించాలి. కానీ స్మిత్‌ అలా చేయలేదు. సారథిగా సహచరులు గౌరవం ఇవ్వాలి. అటువంటిది స్మిత్‌ పూర్తిగా గౌరవం కోల్పోయాడు. దాంతో అతనికి శాశ్వతంగా కెప్టెన్‌గా ఉంచడమే సరైనది. ఆ మేరకు సీఏ చర్యలు తీసుకోవాలి.0 వార‍్నర్‌ను కెప్టెన్సీ చేపట్టే అవకాశం లేకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారో అదే నిబంధనను స్మిత్‌కు కూడా వర్తింప చేయాలి' అని చాపెల్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు