ఐబీఎల్ వేలం మళ్లీ వాయిదా

19 Jul, 2013 05:45 IST|Sakshi

 న్యూఢిల్లీ: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో ఆటగాళ్ల వేలం మళ్లీ వాయిదా పడింది. బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిం చుకునేందుకు రెండు రోజుల సమయం కావాలని ఫ్రాంచైజీల యజమానులు చేసిన విజ్ఞప్తి మేరకు నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
  ఈనెల 22న ఈ వేలం జరిగే అవకాశాలున్నాయి. షెడ్యూల్ ప్రకారం జూన్ 30న జరగాల్సిన వేలాన్ని ఈనెల 19కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలో ఈనెల 21న ఫ్రాంచైజీలన్నీ సమావేశమవుతాయని లీగ్ కమర్షియల్ పార్ట్‌నర్ స్పోర్టీ సొల్యూషన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు 14 నుంచి 31 వరకు ఐబీఎల్ జరగనుంది. వేలంలో పాల్గొనే విదేశీ ఆటగాళ్ల తుది జాబితా ఇప్పటివరకూ ఖరారు కాకపోవడమే వేలం వాయిదా వేయడానికి కారణమనే కథనం వినిపిస్తోంది.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు