ఇంటర్‌పోల్‌తో చేతులు కలిపిన ఐసీసీ

4 Apr, 2019 17:57 IST|Sakshi

దుబాయ్‌: గత కొంతకాలంగా క్రికెట్‌ను ఫిక్సింగ్‌ భూతం పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని నిరోధించడానికి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ఎన్ని రకాల చర్యలు తీసుకుం టున్నప్పటికీ పూర్తిస్థాయిలో సఫలం కావడం లేదు. దీంతో ఐసీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌ంగ్‌ను తరిమికొట్టేందుకు ఇంటర్‌ పోల్‌తో కలసి పనిచేయనుంది. ఈ మేరకు గత వారం ఫ్రాన్స్‌లోని లియోన్‌లో ఉన్న ఇంటర్‌పోల్‌ అధికారులతో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం జనరల్‌ మేనేజర్‌ అలెక్స్‌ మార్షల్‌ సమావేశమై చర్చించినట్లు ఐసీసీ ఓ లేఖలో వెల్లడించింది.

‘ప్రపంచ వ్యాప్తంగా నేరాల నియంత్రణకు కృషి చేసే సంస్థ ఇంటర్‌పోల్‌. దీనికి 194 దేశాలతో అనుబంధం ఉంది. అలాంటి సంస్థతో కలసి పనిచేయాలని ఐసీసీ నిర్ణయించింది. దీనివల్ల క్రికెట్‌ వ్యవహారాల్లో అవినీతి, ఫిక్స్‌ంగ్‌ జాఢ్యాలను పూర్తిగా నియంత్రించేందుకు వీలవుతుంది’అని ఆ లేఖలో పేర్కొంది. కాగా, దీనిపై ఇంటర్‌పోల్‌ క్రిమినల్‌ నెట్‌వర్క్‌ యూనిట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోస్‌ డి గ్రేసియా మాట్లాడుతూ క్రికెట్‌లో అవినీతి, ఫిక్సింగ్‌ వ్యవహారాల నియంత్రణకు ఐసీసీతో కలసి పనిచేయనున్నం దుకు సంతోషం వ్యక్తం చేశారు.

 

మరిన్ని వార్తలు