శ్రీలంక స్పిన్నర్ సేననాయకేపై నిషేధం

12 Jul, 2014 21:25 IST|Sakshi

కొలంబో: శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ సచిత్రా సేననాయకేపై అంతర్జాతీయ క్రికెట్ మండలి వేటు వేసింది. గత మేలో ఇంగ్లండ్ పర్యటనలో సేననాయకే నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేసినందుకు ఐసీసీ అతనిపై నిషేధం విధించింది.


సేననాయకేపై నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. ఇంగ్లండ్లోని కార్డిఫ్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ స్పోర్ట్స్ స్కూల్ లంక స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్ను పరిశీలించి నివేదికను ఐసీసీకి సమర్పించింది. సేననాయకే నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేసినట్టు తేలడంతో వేటు వేశారు.

>
మరిన్ని వార్తలు