అదే రూల్ ఫాలో అవుదామా?

5 Jun, 2020 12:52 IST|Sakshi

కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌లపై ఐసీసీ తర్జన భర్జన

కరోనా కాలంలో ఇదే ఉత్తమం: ఈసీబీ

దుబాయ్‌:  ఈ కరోనా కాలంలో ఏదైనా ఒక సంస్థలో తప్పనిసరి పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పుడు వైరస్‌ సోకితే ఆ వ్యక్తి స్థానాన్ని భర్తీ చేయడానికి మరొక రిప్లేస్‌మెంట్‌ ఉండాలి. ఆ వైరస్‌ బారిన పడిన వ్యక్తికి బ్యాకప్‌ ఉండాలి, చాలా సంస్థల్లో ఇదే పద్ధతిని అవలంభిస్తున్నారు. కొంతమంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తుండగా, మరి కొందరు సంస్థల్లో పని చేస్తున్నారు. ఈ క‍్రమంలోనే కరోనా సోకిన వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించడమే కాకుండా పనికి ఆటంకం లేకుండా చూసుకుంటున్నారు. ఇది కత్తి మీద సాము చేసేనట్లే కానీ తప్పడం లేదు. మరి మైదానాల్లో క్రీడా ఈవెంట్‌లో నిర్వహించాలంటే చాలా పెద్ద సాహసమే చేయాలి. దీనిలో భాగంగా ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న క్రికెట్‌ను ఎలా నిర్వహించాలనే దానిపై ఐసీసీ తర్జన భర్జనలు పడుతోంది. (డబ్బులు వద్దు... భారత్‌తో టెస్టును చూస్తాం! )

మైదానంలో మ్యాచ్‌లు జరిగే క్రమంలో ఒక క్రికెటర్‌కు కరోనా సోకితే పరిస్థితి ఏమిటి అనే దానిపై ఆలోచనలు చేస్తోంది. ఇందుకు కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ విధానాన్ని అవలంభించడమే ఉత్తమం అని యోచిస్తోంది. మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు ఒక ఆటగాడు గాయపడిన క్రమంలో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌(ఆటగాడి స్థానంలో మరొక ఆటగాడు) రూల్‌ను తీవ్రంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే ఇది అమలవుతుండగా కరోనాకు ఇదే రూల్‌ను ఫాలో అవ‍్వడమే ఉత్తమం అని ఐసీసీ పెద్దలు ఆలోచన. ఈ విషయంపై ఇంగ్లండ్‌-వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) స్పెషల్‌ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ స్టీవ్‌ ఎల్వర్తీ మాట్లాడుతూ.. ఈ కరోనా కాలంలో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ నిబంధనను ఫాలో అవ్వడమే మంచిదని అంటున్నారు. దీనిపై ఇప్పటికే ఐసీసీతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేకంగా టెస్టు మ్యాచ్‌లకు ఈ విధానాన్ని అవలంభిస్తే సరిపోతుందని ఆయన తెలిపారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దీని అవసరం ఉండకపోవచ్చని స్టీవ్‌ ఎల్వర్తీ పేర్కొన్నారు. వచ్చే నెలలో ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య టెస్టు సిరీస్‌ జరపడానికి గ్రీన్‌ సిగ్నల్‌ పడిన నేపథ్యంలో కరోనా వైరస్‌పై విస్తృతంగా చర్చిస్తున్నారు. (అక్తర్‌ వివాదం.. మాకు సంబంధం లేదు!)

మరిన్ని వార్తలు