ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో మార్పులు

23 Sep, 2016 11:29 IST|Sakshi
ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో మార్పులు

దుబాయ్:  అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కోడ్ ఆఫ్ కండక్ట్, అంపైర్‌ నిర్ణయ పునః సమీక్ష పద్దతి (డీఆర్‌ఎస్)లో పలు మార్పులు చేసింది.  ఇవి వెంటనే అమల్లోకి రానున్నాయి.  కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా పదేపదే నిబంధనలను అతిక్రమించే ఆటగాళ్లు ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాల్సిందే.  ఎందుకంటే ఇలాంటి వారికోసం డీమెరిట్ పాయింట్లను పరిగణలోకి తీసుకుంటారు.  వీటిని రెండేళ్ల పాటు లెక్కేస్తారు.  ప్రతీ ఆటగాడి ఖాతా కూడా సున్నా పాయింట్లతో ఆరంభం కానుంది. నిర్ణీత సమయానికి ఎక్కువ పాయింట్లు సాధించిన ఆటగాడు సస్పెండ్ అవకాశాలుంటాయి. కాగా, నియమావళి జాబితాలో కానీ, వాటి జరిమానాలోనూ మార్పు చేయలేదు.

మరోవైపు అంపైర్ ఇచ్చిన ఎల్బీడబ్ల్యు నిర్ణయం నాటౌట్‌గా తేలాలంటే బంతి సగ భాగం కంటే ఎక్కువగా ప్యాడ్‌కు ఆఫ్ స్టంప్ అవుట్ సైడ్ కానీ లెగ్ స్టంప్ అవుట్ సైడ్ ను పరిశీలిస్తారు. గతంలో ఇది సెంటర్ ఆఫ్ ఆఫ్ స్టంప్ గా, సెంటర్ ఆఫ్ లెగ్‌స్టంప్‌గా ఉండేది.  తాజా నిబంధన ద్వారా బ్యాట్స్ మన్ ప్యాడ్ ను అడ్డుపెట్టకుండా ఉంటే అది బెయిల్ ను తాకుతుందా?లేదా అనే అంశాన్ని డీఆర్ఎస్ ద్వారా పరిశీలించిన తరువాత థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని ప్రకటిస్తాడు.

మరిన్ని వార్తలు