ఔట్‌ లేదా నాటౌట్‌?: మీరే చెప్పండి..

24 May, 2018 08:35 IST|Sakshi
వీడియో స్క్రీన్‌ షాట్‌

సాక్షి, వెబ్‌ డెస్క్‌ : గల్లీ క్రికెట్‌లో ఔట్‌ అయ్యావ్‌..! అని బ్యాట్స్‌మన్‌తో అంటే.. కాదు అని అతను పేచీకి దిగడం సహజమే. అయితే, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న హంజా అనే వ్యక్తి న్యాయం కోసం ఏకంగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)ను ఆశ్రయించాడు.

ఈ మేరకు మ్యాచ్‌ సమయంలో రికార్డు చేసిన వీడియోను ఐసీసీకు ట్వీట్‌ చేసి న్యాయం చెప్పాలని కోరారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతని వీడియోపై స్పందించిన ఐసీసీ నిబంధన 31(1) ప్రకారం బ్యాట్స్‌మన్‌ ఔట్‌ అని తేల్చింది. ఈ మేరకు రీట్వీట్‌ చేసింది కూడా.

ఐసీసీ చేసిన ట్వీట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ దాదాపు 2 మిలియన్ల మంది ఆ వీడియోను చూశారు. మరి మీరూ ఆ వీడియోను చూసేయండి.

మరిన్ని వార్తలు