సైమండ్స్‌కు బ్రెట్‌లీ గుండు గీసిన వేళ..!

1 May, 2020 11:26 IST|Sakshi

దుబాయ్‌: కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ వేళ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తమ యాక్టివిటీల్లో బిజీగా ఉంటుంది. పాత, కొత్త జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ  అభిమానులకు వినోదాన్ని పంచుతూ ముందుకు సాగుతోంది. తాజాగా  ఐసీసీ తమ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన ఒక పాత ఫోటో మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను తీసుకొచ్చింది. ఆసీస్‌ మాజీ క్రికెటర్లు ఆండ్రూ సైమండ్స్‌-బ్రెట్‌ లీ ఫొటోను షేర్‌ చేసింది. ఆండ్రూ సైమండ్స్‌కు బ్రెట్‌ లీ నున్నగా గుండు గీస్తున్న ఫోటోను పోస్ట్‌ చేనింది. ‘హెయిర్‌ అప్రిసియేషన్‌ డే’ను పురస్కరించుకుని ఈ ఫోటోను ఐసీసీ సోషల్‌ మీడియా పెట్టింది.  క్రికెట్‌ కెరీర్‌లో ఎప్పుడూ  విన్నూత్నంగా కనబడే  సైమండ్స్‌ రకరకాల హెయిర్‌ స్టైల్స్‌తో అలరించేవాడు. ఈ క్రమంలోనే సైమండ్స్‌ తలపై ట్రిమ్మర్‌తో బ్రెట్‌ లీ గుండు గీసిన ఒకనాటి జ్ఞాపకాన్ని మళ్లీ గుర్తు చేసింది ఐసీసీ. (గేల్‌.. ఇక నీ కామెంట్స్‌ చాలు..!)

‘హ్యాపీ హెయిర్‌ అప్రిసియేషన్‌ డే.. ఐసోలేషన్‌లో ఉన్న మీకు ఎవరు హెయిర్‌ స్టైల్‌ చేస్తున్నారు’ అని క్యాప్షన్‌ కూడా జత చేసింది. 1998లో  పాకిస్తాన్‌తో  జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసిన సైమండ్స్‌.. 198  వన్డేలు ఆడాడు. వైట్‌ బాల్‌ క్రికెట్‌లో అటు బ్యాట్‌తో,ఇటు బంతితో రాణించిన సైమండ్స్‌ తనదైన ముద్ర వేశాడు. వన్డేల్లో 5,008 పరుగులు, 133 వికెట్లు సాధించాడు సైమండ్స్‌. ఇక 26 టెస్టు మ్యాచ్‌లు, 14 అంతర్జాతీయ టీ20లను సైమండ్స్‌ ఆడాడు. మరొకవైపు ఆసీస్‌ స్పీడ్‌ స్టార్‌గా పేరు గాంచిన బ్రెట్‌ లీ తన కెరీర్‌లో 221 వన్డే మ్యాచ్‌లు ఆడి 380 వికెట్లు సాధించాడు. ఇక 76 టెస్టుల్లో 310 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్‌ తరఫున 25 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బ్రెట్‌ లీ 28 వికెట్లను తీశాడు. 2012లో ఆసీస్‌ తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు బ్రెట్‌ లీ.(రాస్‌ టేలర్‌కు ‘టాప్‌’ అవార్డు)

Happy #HairstyleAppreciationDay 💇‍♀️ Who is styling your hair during isolation?

A post shared by ICC (@icc) on

మరిన్ని వార్తలు