తస్కిన్, సన్నీలపై నిషేధం

19 Mar, 2016 18:29 IST|Sakshi

న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ పేసర్ తస్కిన్ అహ్మద్, ఎడమ చేతి స్పిన్నర్ అరాఫత్ సన్నీలు నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేయడంతో వారిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిషేధం విధించింది. ఈ మేరకు ఆ బౌలర్ల బౌలింగ్ శైలిని పరీక్షించిన అనంతరం  శనివారం ఐసీసీ ఓ నివేదిక విడుదల చేసింది. తస్కిన్, సన్నీలు తమ మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువ వంచి బౌలింగ్ చేయడం నిబంధనలకు విరుద్ధంగా కావడంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

 

ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది.  వీటిని దేశవాళీ లీగ్లు కూడా గుర్తించాలని ఐసీసీ తెలిపింది.  టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరి బౌలింగ్ శైలిపై అంపైర్ల నుంచి మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ తస్కిన్ 14 వన్డేలు ఆడి 21 వికెట్లు తీయగా,13 టీ20ల్లో 9 వికెట్లు సాధించాడు. ఇక సన్నీ 16 వన్డేల్లో 24 వికెట్లు, 10 టీ 20ల్లో 12 వికెట్లు తీశాడు.

మరిన్ని వార్తలు