శ్రీలంక కెప్టెన్‌కు ఐసీసీ భారీ షాక్‌!

16 Jul, 2018 20:59 IST|Sakshi

శ్రీలంక కెప్టెన్‌ దినేష్‌ చండిమాల్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) భారీ షాకిచ్చింది.

శ్రీలంక కెప్టెన్‌ దినేష్‌ చండిమాల్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) భారీ షాకిచ్చింది. చండిమాల్‌తో పాటు కోచ్‌ చందికా హతురుసింఘే, మేనేజర్‌ అశంకా గురుసిన్హాలపై నాలుగు వన్డేలు, రెండు టెస్టుల నిషేధాన్ని విధించింది. క్రమశిక్షణా చర్యల ఉల్లంఘన కింద తీవ్ర నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ఐసీసీ ప్రతినిధి హాన్‌ మైఖెల్‌ బెలాఫ్‌ తెలిపారు.

ఈ ముగ్గురు 8 సస్పెన్షన్‌ పాయింట్లు ఎదుర్కొంటున్నారని, ఈ క్రమంలో తీవ్రంగా పరిగణించామని ఐసీసీ ప్రకటించింది. ఈ నిషేధంతో దినేష్‌ చండిమాల్‌, కోచ్‌ చందికా హతురుసింఘే, మేనేజర్‌ అశంకా గురుసిన్హాలు దక్షిణాఫ్రికాతో జరగనున్న 4 వన్డేలు, 2 టెస్టుల నుంచి వీరిని తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 

సెయింట్‌ లూసియాలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఆట ఆరంభంలో మైదానంలోకి రాకుండా సమయం వృథా చేశారని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆరోజు ఆట రెండున్నర గంటలపాటు ఆలస్యమైందని తెలిపారు. దాంతో పాటుగా ఇటీవల విండీస్‌తో రెండో టెస్టులో భాగంగా చండిమాల్‌ మైదానంలో ఉద్దేశపూర్వకంగానే బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నం చేసినట్లు తేలిందని రిఫరీ జవగళ్‌ శ్రీనాథ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు