అమెరికాకు షాక్ ఇచ్చిన ఐసీసీ

27 Jun, 2015 18:23 IST|Sakshi
అమెరికాకు షాక్ ఇచ్చిన ఐసీసీ

బార్బడోస్: ప్రపంచ పెద్దన్న అమెరికాకు అంతర్జాతీయ క్రికెట్ సంఘం(ఐసీసీ)  షాక్ ఇచ్చింది. ఐసీసీలో అమెరికా సభ్యత్వాన్ని రద్దు చేసింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్రికెట్ అసోసియేషన్(యూఎస్ఏసీఏ) సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఐసీసీ బోర్డు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఇటీవల నియమించిన సమీక్షా కమిటీ నివేదిక మేరకు ఐసీసీ స్పందించింది.

యూఎస్ఏసీఏ పాలన, ఆర్థిక విషయాలు, ప్రతిష్ట, క్రికెట్ కార్యకలాపాలపై సమీక్షా కమిటీ ఆందోళన వ్యక్తం చేయడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే యూఎస్ఏసీఏ సభ్యత్వాన్ని రద్దు చేసినా అమెరికా క్రికెటర్లకు ఎటువంటి నష్టం కలగనీయబోమని ఐసీసీ బోర్డు తెలిపింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు