కోహ్లి సేన కొత్తకొత్తగా..

21 Aug, 2019 15:51 IST|Sakshi

అంటిగ్వా : వెస్టిండీస్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్లు కొత్తగా కనిపించనున్నారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టులో  ఐసీసీ కొత్త నిబంధనలకు అనుగుణంగా కోహ్లి సేనతో పాటు విండీస్‌ ఆటగాళ్లు నయా జెర్సీలతో మైదానంలోకి దిగనున్నారు. దీనిలో భాగంగా టీమిండియా ఆటగాళ్ల కొత్త జెర్సీలను బీసీసీఐ అధికారికంగా విడుదల చేసింది. 

సారథి విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానేతో పాటు యువ సంచలనం రిషభ్‌ పంత్‌లు కొత్త జెర్సీలను ధరించి ఫోటో షూట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో టెస్టు సిరీస్‌కు ఎంపికైన 16 మంది సభ్యులు పాల్గొని సందడి చేశారు. ఆటగాళ్లకు సంబంధించిన ఫోటోలను టీమిండియా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. 

సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు ఐసీసీ కొత్త హంగులు అద్దుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాదిరిగానే టెస్టుల్లోనూ ఆటగాళ్ల జెర్సీల వెనక వారి పేర్లు, నంబర్లు కనిపించనున్నాయి. యాషెస్‌ సిరీస్‌ నుంచే ఈ పద్దతి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక టెస్టుల్లో నంబర్‌ వన్‌ అయిన టీమిండియా విండీస్‌ సిరీస్‌తోనే ఐసీసీ టెస్టు చాంపియన్‌ షిప్‌ వేటను ప్రారంభించనుంది. 

చదవండి:
కోహ్లి ఇంకొక్కటి కొడితే.. 
టెస్టుల్లో పోటీ రెట్టింపైంది

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భారత హాకీ జట్ల జోరు

శ్రీశాంత్‌పై నిషేధం కుదింపు

టెస్టుల్లో పోటీ రెట్టింపైంది

మూడో టెస్టుకు స్మిత్‌ దూరం

ప్రణయ్‌ ప్రతాపం

లిన్‌ డాన్‌ను ఓడించిన ప్రణయ్‌

ఆర్చర్‌ను మెచ్చుకున్న ఆసీస్‌ దిగ్గజ బౌలర్‌

కోహ్లి ఇంకొక్కటి కొడితే.. 

ఆసీస్‌కు షాక్‌.. స్మిత్‌ దూరం

శ్రీశాంత్‌కు భారీ ఊరట

కివీస్‌ సారథిగా టిమ్‌ సౌతీ

హర్యానా యువతితో పాక్‌ క్రికెటర్‌ నిఖా

జడేజా ముంగిట అరుదైన రికార్డు

నన్ను క్షమించండి:  పాక్‌ క్రికెటర్‌

ఫైనల్‌కు కార్తీక వర్ష, నందిని 

చాంపియన్‌ సూర్య 

జూనియర్ల పంచ్‌కు డజను పతకాలు 

సాక్షి మళ్లీ శిబిరానికి.... 

కోహ్లికి స్మిత్‌కు మధ్య 9 పాయింట్లే 

కోహ్లి ‘ఏకాదశి’ 

చాంప్స్‌ మెద్వెదేవ్, కీస్‌

అక్తర్‌ వ్యాఖ్యలపై యువీ చురక

విహారి, రహానే అర్ధ సెంచరీలు

బ్యాటింగ్‌ కోచ్‌ ఎవరో?

శ్రమించి... శుభారంభం

సిన్సినాటి చాంప్స్‌ మెద్వదేవ్, కీస్‌

యాషెస్‌ సిరీస్‌.. గంగూలీ బాటలో హర్భజన్‌

సన్‌రైజర్స్‌ చెంతకు మరో ఆసీస్‌ మాజీ క్రికెటర్‌

ప్చ్‌.. మూడో టెస్టుకు దూరమే

ఆశ్చర్యం.. జాంటీ రోడ్స్‌కు నో ఛాన్స్‌?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆర్‌ఆర్‌ఆర్‌ : ఎన్టీఆర్‌కు జోడి కుదిరిందా.?

ఇండియాలో ఆయనే మెగాస్టార్‌

‘శివ’ గురించి బాధ పడుతున్నా..

సైరాలో సూపర్‌స్టార్‌?

మిస్టరీగా మారిన రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం

సినిమాకి ఆ ఇద్దరే ప్రాణం