కీలక ప్రకటన చేసిన ఐసీసీ

14 Dec, 2017 11:29 IST|Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : ప్రతిష్టాత్మక యాషెస్‌ టెస్ట్‌ సిరీస్‌ పై స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు వినిపించటంతో క్రీడా లోకం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దీనిపై తక్షణ విచారణ చేపట్టిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ జరిగిందనటానికి సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. 

ఐసీసీ యాంటీ కరప్షన్ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ దీనిపై స్పందిస్తూ... ఫిక్సింగ్‌ ఆరోపణలను చాలా తీవ్రంగా పరిగణించాం. మా బృందం ఇప్పటికే రంగంలోకి దిగింది. అయితే ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేవలం ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగానే ఈ విచారణ చేపట్టాం. ఈ ఫిక్సింగ్ ఆరోపణలు టీ20 టోర్నీలతో పాటు క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లపై ప్రభావం చూపుతాయి. మా విచారణలో అన్ని అంశాలను పరిగణనలోకి దీనిపై విచారణ చేస్తున్నాం అని ఆయన వివరించారు. 

కాగా, యాషెస్‌ సిరీస్‌ సందర్భంగా పెర్త్‌ లో వాకా మైదానం వేదికగా గురువారం నుంచి జరగబోయే మూడో టెస్ట్‌ స్పాట్‌ ఫిక్సింగ్ అయినట్లు ఆరోపణలు వినిపించాయి. భారత్ కు చెందిన ఇద్దరు బుకీలు ఈ స్కాంలో ఉన్నట్లు బ్రిటీష్‌ పత్రిక ది సన్‌ ఆరోపణలు గుప్పించింది. అయితే ఇరు జట్లకు చెందిన సభ్యుల పేర్లు ఆ కథనంలో ప్రస్తావించపోగా.. ఆస్ట్రేలియాకు చెందిన బుకీ గ్రూప్‌ ‘ది సైలెంట్‌ మాన్‌’ భారీ మొత్తానికి ఈ మ్యాచ్‌ను ప్రభావితం చేసేందుకు ప్రణాళిక పన్నిందని ఆ కథనం వివరిచింది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంతో సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు