శుభారంభంపై కుర్రాళ్ల గురి

28 Jan, 2016 02:14 IST|Sakshi
శుభారంభంపై కుర్రాళ్ల గురి

నేడు ఐర్లాండ్‌తో భారత్ తొలి మ్యాచ్
అండర్-19 ప్రపంచ కప్

మిర్పూర్: అండర్-19 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లలో చెలరేగిన భారత జట్టు అసలు పోరుకు సిద్ధమైంది. నేడు (గురువారం) గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగే మ్యాచ్‌లో భారత్, ఐర్లాండ్‌తో తలపడుతుంది. పెద్దగా అనుభవం లేని ఐర్లాండ్‌తో పోలిస్తే భారత్ చాలా పటిష్టంగా ఉంది.

జట్టు సభ్యులలో ఐదుగురు ఇప్పటికే రంజీ ట్రోఫీలో ఆడగా, సర్ఫరాజ్, భుయ్‌లాంటివారికి ఐపీఎల్‌లో అనేక మంది దిగ్గజ క్రికెటర్లతో ఆడిన అనుభవం కూడా ఉంది. వీటికి తోడు కోచ్‌గా భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనం ఈ కుర్రాళ్లకు అదనపు బలం. ఆస్ట్రేలియా జట్టు తప్పుకోవడంతో భారత జట్టే ప్రస్తుతం ఫేవరెట్‌గా కనిపిస్తోంది. మొదటి వార్మప్ మ్యాచ్‌లో కెనడాను 372 పరుగులతో చిత్తు చేసిన భారత్, తర్వాతి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది.

బంగ్లాదేశ్ గెలుపు
టోర్నీ తొలి రోజు ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్ 43 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించగా, మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఏకంగా 299 పరుగులతో ఫిజీని చిత్తుగా ఓడించింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు