మహిళల ప్రపంచ కప్‌తో యూనిసెఫ్‌ ఒప్పందం

21 Dec, 2019 10:11 IST|Sakshi

దుబాయ్‌: ‘యూనిసెఫ్‌’తో తమ భాగస్వామ్యాన్ని మరింత కాలం కొనసాగించనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. మహిళలు, బాలికల సాధికారికత కోసం వచ్చే ఏడాది జరిగే మహిళల టి20 ప్రపంచ కప్‌ టోర్నీ వరకు యూనిసెఫ్‌తో తాము కొనసాగుతామని ఐసీసీ స్పష్టం చేసింది. దీంతో క్రికెట్‌ ఆడే దేశాల్లో బాలల హక్కుల కోసం యూనిసెఫ్‌ చేపడుతోన్న కార్యక్రమాలకు నిధుల సేకరణలో ఐసీసీ సహాయపడినట్లవుతుంది.

ఐసీసీ క్రికెట్‌ ఈవెంట్‌ల ద్వారా సమకూర్చిన నిధుల్ని బాలికలకు క్రికెట్‌ క్రీడ నేర్పించేందుకు, మౌలిక సదుపాయాలు, శిక్షణా సిబ్బంది ఏర్పాటు వంటి తదితర కార్యక్రమాల కోసం వినియోగించనున్నారు. తాజా వన్డే ప్రపంచ కప్‌–2019 సమయంలో సేకరించిన నిధులను కూడా అఫ్గానిస్తాన్‌లో బాలికల క్రికెట్‌ ప్రాజెక్ట్‌ కోసం వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు కూడా పాలుపంచుకోవచ్చని ఐసీసీ తెలిపింది. టిక్కెట్ల కొనుగోలు ద్వారా వారు ఇందులో భాగస్వాములు కావచ్చని పేర్కొంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇప్పుడు చెప్పండి అది ఎలా నాటౌట్‌?

కరోనాపై బుడతడి క్లారిటీ.. సెహ్వాగ్‌ ఫిదా

కరోనా టైమ్స్‌: ఆనంద్‌తో చెస్‌ ఆడే ఛాన్స్‌!

ముందు కోహ్లిని ఔట్‌ చేయండి.. చహల్‌ స్ట్రాంగ్‌ రిప్లై

బిగ్‌ హిట్టర్‌ ఎడ్వర్డ్స్‌ కన్నుమూత

సినిమా

‘ఏమబ్బా, అందరూ బాగుండారా..’

తమ్మారెడ్డికి చిరంజీవి పరామర్శ

స్టార్‌ కమెడియన్‌ మృతి

కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

శుభవార్త చెప్పిన స్టార్‌ జంట

బిగ్‌బాస్‌: ‘అవును ప్రేమించుకుంటున్నాం’