వరల్డ్‌కప్‌లో అష్టావక్ర మైదానాలు!

12 Jun, 2019 12:20 IST|Sakshi
ఐసీసీ ప్రపంచకప్‌-2019 వేదికలు

లండన్‌ : ఇంగ్లండ్‌లో ప్రపంచకప్‌ జరుగుతున్న 11 వేదికలు ఇవి... రూపంలో కానీ, బౌండరీ కొలతల విషయంలో కానీ ఒక్క సౌతాంప్టన్‌ మినహా ఎక్కడా మైదానాలు సరైన రూపంలో లేవు. వేర్వేరు కారణాలతో బౌండరీ లైన్‌లు కూడా క్రమపద్ధతిలో లేవు. పిచ్‌ నుంచి ఒకవైపు సాగదీసినట్లున్న లీడ్స్‌లాంటి చోట ఇరు వైపుల ఉండే బౌండరీ దూరాల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఇక పరుగుల వరదకు కేంద్రమైన నాటింగ్‌హామ్‌ గ్రౌండ్‌లో మిడ్‌వికెట్‌ బౌండరీ 64 మీటర్లే ఉండగా, ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో కూడా అన్నింటికంటే తక్కువగా 60 మీటర్లకే బౌండరీ లైన్‌ ఉంది. టోర్నీలో మైదానం కోణాలు, బౌండరీ దూరాన్ని బట్టి కూడా ప్రతీ జట్టు తమ వ్యూహాలు మార్చుకోవాల్సిందే.

ఈ అష్టావక్ర మైదానాలపై టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘రోస్‌బౌల్‌ మైదానం(సౌతాంప్టన్‌)లా రోటీ చేద్దామనుకున్నా.. కానీ అది హెడింగ్లీ (లీడ్స్‌) మైదానంలా అయ్యింది. మీ రోటీ ఏ మైదానంలా ఉంది?’ అంటూ సరదాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ మైదానాలకు సంబంధించి ఫొటో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అభిమానులు వంకరటింకరగా ఉన్న మైదాలనుద్దేశించి కుళ్లు జోకులు పేల్చుతున్నారు. ఇక చిన్న మైదానమైన నాటింగ్‌హామ్‌లో రేపు భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరిగే మ్యాచ్‌లో ఎన్ని రికార్డు పరుగులు నమోదవుతాయో చూడాలి! 

While making roti, i tried making Rose Bowl, but at best ended with Headingley. What’s your Roti status ?

A post shared by Virender Sehwag (@virendersehwag) on

మరిన్ని వార్తలు