అవకాశం వస్తే ఆర్సీబీకే : సునీల్‌

21 Mar, 2020 12:38 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఫుట్‌బాల్‌ ఆడుతున్న క్రీడాకారుల్లో భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ చెత్రీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇంకా ఫుట్‌బాల్‌ ఆడుతున్న ఆటగాళ్ల పరంగా చూస్తే అత్యధిక అంతర్జాతీ గోల్స్‌ చేసిన జాబితాలో చెత్రీ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ క్రిస్టియానో పోర్చుగల్‌ స్టార్‌ రొనాల్డో(90) తొలి స్థానంలో ఉండగా, చెత్రీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకూ చెత్రీ 72 గోల్స్‌ సాధించాడు. ఇక మూడో స్థానంలో అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ మెస్సీ(70) ఉన్నాడు. కాగా, చెత్రీకి ఒక ఫుట్‌బాల్‌ కాక వేరే గేమ్స్‌ గురించి కూడా తెలుసు. ఈ విషయాన్ని ఇటీవలే చెత్రీ స్పష్టం చేశాడు. (మహ్మద్‌ కైఫ్‌ ట్వీట్‌పై మోదీ ఇలా..)

దీనిలో భాగంగా చెత్రీకి ఎదురై క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్స్‌ చిట్‌చాట్‌లో ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి.  వీటికి చెత్రీ తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘ మీరు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ఆడాల్సి వస్తే దేనికి ఆడతారు’ అని అడగ్గా.. ‘నేను అవకాశం వస్తే ఆర్సీబీ తరఫున ఆడతా. నాకు విరాట్‌ కోహ్లి మంచి స్నేహితుడు కూడా’ అని సమాధానమిచ్చాడు. తాను బెంగళూరు వ్యక్తినని, దాంతో మీ ప్రశ్నలోనే ఆన్సర్‌ ఉందంటూ చెత్రీ పేర్కొన్నాడు. ‘ ఫుట్‌బాల్‌ కాకుండా మీ ఏ గేమ్‌ల్లో రొనాల్డో-మెస్సీలను ఓడించగలరు’ అని మరొక ప్రశ్న ఎదురుకాగా, ‘క్యారమ్స్‌లో  వారిద్దర్నీ వాడిస్తా’ అని బదులిచ్చాడు. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్‌ ఆందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో చెత్రీ-అతని భార్య సోనమ్‌లు గృహ నిర్భందంలో ఉన్నారు. గత ఐదు రోజులుగా ఇంటిలోనే స్వీయ నిర్భందాన్ని పాటిస్తున్నామని చెత్రీ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తన భార్యతో కలిసి వంట గదిలో ఆహార పదార్థాలను వండటాన్ని నేర్చుకుంటున్నట్లు చెత్రీ తెలిపాడు. (దిగ్గజ క్రికెటర్‌ను అవమానపరుస్తారా?)

మరిన్ని వార్తలు