అలా అయితేనే విదేశాల్లో గెలుస్తాం: కోహ్లి

15 Oct, 2018 13:00 IST|Sakshi

హైదరాబాద్‌: వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాలో క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో విరాట్ సేన 10 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను కైవశం చేసుకుంది. ఈ మ్యాచ్ తర్వాత మాట్లాడిన విరాట్‌ కోహ్లి... భారత బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల కాలంలో తమకు బౌలింగ్‌ అనేది సమస్యే కావడం లేదంటూ బౌలర్లను కొనియాడాడు. అదే సమయంలో బ్యాటింగ్‌పై మాత్రం కాస్త నిరాశ వ్యక్తం చేశాడు. ప్రధానంగా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు బ్యాటింగ్‌ విభాగంలో విఫలం కావడంతోనే సిరీస్‌లను కోల్పోవల్సి వస్తుందన్నాడు.

‘మేము విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు బ్యాటింగ్‌ అనేది సమస్యగా మారింది. ముఖ్యంగా మా బ్యాటింగ్‌లో నిలకడ ఉండటం లేదు. దాంతోనే విదేశీ సిరీస్‌లను సాధించడంలో వైఫల్యం చెందుతున్నాం. విదేశీ సిరీస్‌లను గెలవాలంటే బ్యాటింగ్‌ అనేది మెరుగుపడాలి. అప్పుడే అక్కడ‍్నుంచి సగర్వంగా స్వదేశానికి రాగలం. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే మాకు ఎటువంటి సమస్యా లేదు. బౌలర్లు తమ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తున్నారు. గత సిరీస్‌ నుంచి చూస్తే టెస్టుల్లో 20 వికెట్లను మా బౌలర్లు తీయగలుతున్నారు. అందుకు వారి కృషి చేలానే ఉంది. బ్యాటింగ్‌ విషయంలో స్వదేశంలో పూర్తిస్థాయిలో ఆడగల్గుతున్నాం. ఇదే ప్రదర్శన విదేశాల్లో కూడా పునరావృతం చేయాలి’ అని కోహ్లి పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు