సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేసిన అఫ్గాన్‌ క్రికెటర్‌

5 Jul, 2019 15:40 IST|Sakshi

లీడ్స్‌: అఫ్గానిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ ఇక్రమ్‌ అలీ ఖిల్‌ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. అది కూడా సుమారు 27 ఏళ్ల నాటి మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును అలీ ఖిల్‌ బ్రేక్‌ చేసి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. వరల్డ్‌కప్‌ చరిత్రలో పిన్నవయసులో 80కి పైగా పరుగులు సాధించిన క్రికెటర్‌గా అలీ ఖిల్‌ గుర్తంపు సాధించాడు. ఈ క్రమంలోనే 1992 వరల్డ్‌కప్‌లో సచిన్‌ నమోదు చేసిన రికార్డు తెరమరుగైంది. ‌1992 వరల్డ్‌కప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ 81 పరుగులు చేశాడు.(ఇక్కడ చదవండి: అఫ్గానిస్తాన్‌ 0)

ఒక వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్‌ 18 ఏళ్ల 318 రోజుల వయసులో 80కి పైగా పరుగులు సాధించగా, తాజాగా దాన్ని అలీ ఖిల్‌ బద్ధలు కొట్టాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అలీ ఖిల్‌ 86 పరుగులు సాధించాడు. అయితే 18 ఏళ్ల 278 రోజుల వయసులోనే వరల్డ్‌కప్‌ వేదికలో 80కి పైగా పరుగులు సాధించి అత్యంత పిన్నవయసులో ఆ ఫీట్‌ను నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అఫ్గానిస్తాన్‌ క్రికెటర్‌ మహ్మద్‌ షెహజాద్‌ గాయపడి టోర్నీ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో ఇక్రమ్‌ అలీ ఖిల్‌కు అవకాశం లభించింది. (ఇక్కడ చదవండి: నాపై కుట్ర చేశారు: క్రికెటర్‌)


 

మరిన్ని వార్తలు